తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైళ్లలో ఆహార సేవలు పునరుద్ధరణ

కరోనా కారణంగా రైళ్లలో నిలిపివేసిన ఆహారం సేవలను పునరుద్ధరించాలని రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత రైల్వే క్యాటరింగ్‌, పర్యాటక సంస్థ(ఐఆర్‌సీటీసీ)కు లేఖ రాసింది. కొవిడ్-19 కారణంగా గతేడాది ఈ సేవలను నిలిపివేసింది రైల్వేశాఖ.

Railway Board
రైల్వేబోర్డు

By

Published : Nov 20, 2021, 5:54 AM IST

రైళ్లలో ఎక్కువదూరం ప్రయాణించేవారికి ఉపశమనం కలిగించేదిశగా చర్యలు చేపట్టింది రైల్వే బోర్డు. రైళ్లలో వండిన ఆహారం అందించే సేవలను పునరుద్ధరించాలని శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు భారత రైల్వే క్యాటరింగ్‌, పర్యాటక సంస్థ(ఐఆర్‌సీటీసీ)కు రాసిన లేఖలో పేర్కొంది.

"రైలు సర్వీలు ప్రారంభమైన దృష్ట్యా, రెస్టారెంట్స్, హోటళ్లలో కొవిడ్-19 ఆంక్షలు సడలించిన కారణంగా.. రైళ్లలో వండిన ఆహారాన్ని అందించే ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది." అని ఐఆర్‌సీటీసీకు రాసిన లేఖలో పేర్కొంది.

అయితే.. ఏ తేదీనుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయో ఇంకాస్పష్టం చేయలేదు రైల్వేశాఖ. ఇప్పటికే దేశీయ విమానాల్లో వండిన ఆహారాన్ని అందించేందుకు అనుమతినిచ్చింది విమానయాన మంత్రిత్వ శాఖ.

ABOUT THE AUTHOR

...view details