తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Special Trains: 'స్పెషల్​ రైళ్లు' రద్దు చేస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు

రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం 30శాతం అధిక ధరతో నడుస్తోన్న స్పెషల్‌ రైళ్లను రద్దు(special trains) చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

trains
రైళ్లు

By

Published : Nov 13, 2021, 5:04 AM IST

ప్రత్యేక రైళ్లు అనే ముద్ర ఇకపై తొలగిపోనుంది. స్పెషల్‌ ట్రైన్స్‌(special trains) పేరిట వసూలు చేసే అధిక ఛార్జీలకు కూడా రైల్వే శాఖ ముగింపు పలకనుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు ముందున్న విధంగానే రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చి టికెట్ ధరలు తగ్గించనుందని పేర్కొంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది.

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి రైల్వేశాఖ కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. అనవసర ప్రయాణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఛార్జీలను కూడా పెంచింది. అయితే పాతవాటినే ప్రత్యేక రైళ్లుగా నడుపుతూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ.. ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. కరోనా ముందున్న విధంగానే రైళ్ల పేర్లు, నంబర్లు, ఛార్జీలు అమలు చేయాలని పేర్కొంటూ రైల్వేబోర్డు అన్ని జోనల్‌కార్యాలయాలకు లేఖలు రాసింది. అన్ని రైళ్లు పట్టాలు ఎక్కడానికి ఒకట్రెండు రోజులు పడుతుందని సీనియర్‌ రైల్వే అధికారి చెప్పారు. ప్రత్యేక రైళ్ల నంబరు సున్నాతో ప్రారంభమవుతుందని, ఇప్పటి నుంచి అది ఉండబోదని తెలిపారు. అయితే.. కరోనా కారణంగా రాయితీలు, బెడ్‌రోల్స్‌, భోజనాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని చెప్పారు.

విమాన ఛార్జీలూ తగ్గించండి..

అంతర్జాతీయ షెడ్యూల్డ్ ప్యాసింజర్ విమాన రాకపోకలు తిరిగి ప్రారంభించాలని విమానయాన శాఖను కోరారు కొందరు పార్లమెంటరీ ప్యానల్ సభ్యులు. విమాన ఛార్జీలు అధికంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

హిందూ మతం, హిందుత్వం.. ఈ రెండూ వేరు: రాహుల్​ గాంధీ

ABOUT THE AUTHOR

...view details