Railway Apprenticeship 2023 : పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని భారతీయ రైల్వేస్‌కు చెందిన బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్‌డబ్ల్యూ) 2022-23 సంవత్సరానికి 46వ బ్యాచ్ యాక్ట్ అప్రెంటీస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. మొత్తం 374 యాక్ట్ అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల యువతీయువకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు..
BLW Apprentice Vacancy : 374 యాక్ట్ అప్రెంటీస్ పోస్టులు (ఐటీఐ- 300 ఖాళీలు, నాన్-ఐటీఐ- 74 ఖాళీలు)
విద్యార్హతలు(BLW Apprentice Qualification)
- నాన్ ఐటీఐ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి.
- ఐటీఐ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఐటీఐ అప్రెంటీస్ ట్రేడ్స్(BLW Apprenticeship Trades)..
- ఫిట్టర్
- కార్పెంటర్
- పెయింటర్ (జనరల్)
- మెషినిస్ట్
- వెల్డర్ (జి అండ్ ఇ)
- ఎలక్ట్రీషియన్
- నాన్ ఐటీఐ అప్రెంటీస్ ట్రేడ్స్..
- ఫిట్టర్
- కార్పెంటర్
- పెయింటర్ (జనరల్)
- మెషినిస్ట్
- వెల్డర్ (జి అండ్ ఇ)
- ఎలక్ట్రీషియన్
వయోపరిమితి(BLW Apprenticeship Age Limit)..
- 2023 నవంబర్ 25 నాటికి ఐటీఐ అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
- నాన్-ఐటీఐ అప్రెంటీస్ అభ్యర్థుల వయసు 15 నుంచి 22 ఏళ్లలోపు ఉండాలి.
- ఐటీఐ వెల్డర్ అండ్ కార్పెంటర్ ట్రేడులకు అభ్యర్థుల వయసు 22 సంవత్సరాలు మించకూడదు.
- నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు- 10 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం..
BLW Apprentice Selection Process :అకడమిక్స్‌లో వచ్చిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.