తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంజినీర్​ ఘనకార్యం.. ఏకంగా రైలు ఇంజిన్​నే అమ్మేసి.. - రైలు ఇంజిన్ అమ్మేసిన ఇంజినీర్

Rail Engine Sold Bihar: రైల్లో దొంగతనం చేయడం విన్నాం. కానీ ఏకంగా రైలు ఇంజిన్​నే దొంగిలించి అమ్మేయడం ఎప్పుడైనా విన్నారా? అవును ఈ ఘనకార్యం చేసింది ఎవరో కాదు. అదే స్టేషన్​లో పనిచేసే ఓ రైల్వే ఇంజినీర్​.

Rail Engine Sold Bihar
రైలు ఇంజిన్​ ను అమ్మేసిన ఇంజినీర్

By

Published : Dec 20, 2021, 7:00 PM IST

Updated : Dec 20, 2021, 10:27 PM IST

రైలు ఇంజిన్ దొంగ

Rail Engine Sold Bihar: రైల్వే శాఖలో ఇంజినీర్​గా పనిచేసే ఓ వ్యక్తి.. ఏకంగా రైలు ఇంజిన్​పైనే కన్నేశాడు. అతని కుటిల బుద్ధికి.. ఓ ఇన్​స్పెక్టర్, హెల్పర్ తోడయ్యారు. ఇంకేముంది గుట్టుచప్పుడు కాకుండా రైలు ఇంజిన్​ను పాతసామాన్లు కొనే ఓ మాఫియాకు అమ్మేశారు.

రైలు ఇంజిన్ నిలిపిఉన్న ప్రాంతం

ఏమైందంటే..?

బిహార్​, పుర్ణియా కోర్ట్​ రైల్వే స్టేషన్​ పరిధిలో ఉన్న సమస్తిపుర్​ లోకో డీజిల్ షెడ్​లో రాజీవ్​ రంజన్​ ఝా ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. పుర్ణియా స్టేషన్​లో చిన్నరైల్వే ట్రాక్​పై తిరిగే ఓ పాత రైలు ఇంజిన్​ ఉంది. నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి.. అవి జిల్లా పైఅధికారుల నుంచి వచ్చినట్లుగా నమ్మించాడు.

పూర్ణియా కోర్ట్ రైల్వే స్టేషన్
రైలు ఇంజిన్​కు సంబంధించిన పరికరాలు
పూర్ణియా కోర్ట్ రైల్వే స్టేషన్ ట్రాక్

పాత సామాను కొనుగోలు చేసే ఓ మాఫియాకు ఈ ఇంజిన్​ను అమ్మేశాడు. ఈ వ్యవహారంలో రాజీవ్​కు స్థానికంగా పనిచేసే ఓ పోలీస్​ ఇన్​స్పెక్టర్ వీరేంద్ర ద్వివేది ​, ఓ హెల్పర్ సహకరించారు.

ఇంజిన్​ను ఎలా తరలించారంటే..?

అంతకుముందే.. నకిలీ ధ్రువపత్రాలను సృష్టించిన రాజీవ్.. డిసెంబరు 14న హెల్పర్​ సాయంతో గ్యాస్ కట్టర్​తో రైలు ఇంజిన్​ను ముక్కలుగా చేస్తూ కనిపించారు. అక్కడున్న కొంతమంది అధికారులు దాన్ని అడ్డుకోగా నకిలీ ధ్రువపత్రాలను చూపించాడు రాజీవ్​. ఇంజిన్​ పాతదైపోయిందని, విడిభాగాలుగా చేసి డీజిల్​ షెడ్​కు తరలించాల్సిందిగా ఉన్నతాధికారులు అదేశించారని వారిని నమ్మించాడు.

అయితే అదే స్టేషన్​లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు, స్టేషన్ మాస్టర్​కు ఈ విషయంపై అనుమానం వచ్చి డీజిల్​ షెడ్​కు వెళ్లి చూడగా అక్కడ ఇంజిన్ పరికరాలు లేవు. ఇదే విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తమ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు చెప్పారు. దీంతో స్టేషన్​ మాస్టర్, ఉద్యోగులు కలిసి ఆర్​పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టగా నిజం వెలుగులోకి వచ్చింది.

దీంతో పుర్ణియా స్టేషన్​ డీఆర్ఎం అలోక్ అగర్వాల్ ఆదేశాల మేరకు రాజీవ్, వీరేంద్రతోపాటు వీరికి సహకరించిన హెల్పర్​ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:వానరం ప్రేమ.. కుక్కపిల్లను ఎత్తుకుని తిరుగుతూ...

Last Updated : Dec 20, 2021, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details