తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఓటమి తప్పదనే భాజపా ఐటీ దాడుల అస్త్రం'

ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోలేకే ప్రతిపక్ష నేతలపై భాజపా ఐటీ దాడులు చేయిస్తుందని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అది ఆ పార్టీ అనాదిగా పాటిస్తున్న విధానమని విమర్శించారు. తమిళనాడులో ఎన్నికల వేళ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​ కుమార్తె నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిందనే వార్తలపై రాహుల్ ట్విట్టర్​లో స్పందించారు.

Rahul Gandhi, Rahul
రాహుల్​ గాంధీ, రాహుల్

By

Published : Apr 2, 2021, 5:44 PM IST

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమార్తె సెంతామరై నివాసంపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపిందనే వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోలేని సమయంలోనే భాజపా ఇలాంటి దాడులు చేయిస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాలపై ఐటీ శాఖతో సోదాలు నిర్వహించడం కమలదళం అనాదిగా పాటిస్తున్న విధానమని ధ్వజమెత్తారు.

రాహుల్ ట్వీట్​

రాజకీయ దురుద్దేశంతోనే స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటీ తనిఖీలు నిర్వహించిందని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ విమర్శించారు. ఇలాంటి చర్యలతో తాము భయపడబోమని తేల్చి చెప్పారు. ఈ తరహా దాడులను తమ పార్టీ గతంలో ఎన్నో ఎదుర్కొందని పేర్కొన్నారు.

స్టాలిన్ కుమార్తె ఇంట్లో సోదాల విషయంపై ఐటీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దాడులు జరిగాయని గానీ, జరగలేదని గానీ సమాచారం ఇవ్వలేదు.

ఇదీ చూడండి: ఐసోలేషన్​లో ప్రియాంక- ఎన్నికల ప్రచారం రద్దు

ABOUT THE AUTHOR

...view details