తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.70 పల్లీలకు గ్రీన్​ కలర్.. పిస్తా అంటూ కిలో రూ.1100కు అమ్మకం - మహరాష్ట్ర నకిలీ పిస్తా ప్యాక్టరీ

గుట్టుచప్పుడు కాకుండా నకిలీ పిస్తాలను తయారు చేస్తున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ్​పుర్​లోని ఫైరింగ్​ ఏరియాలో ఉన్న స్థావరంపై దాడి చేసి 120 కేజీల నకిలీ పిస్తాలను సీజ్​ చేశారు. రూ.12.50 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

fake pistha
నకిలీ పిస్తా పప్పులు

By

Published : Nov 15, 2022, 5:18 PM IST

నకిలీ పిస్తా పప్పులను తయారు చేస్తున్న ముఠాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ్​పుర్​లోని ఓ ఇంట్లో వేరుశనగ పప్పులను పిస్తాలుగా మార్చుతున్నట్లు తెలుసుకుని దాడి చేసి, 120 కేజీల నకిలీ సరకును సీజ్​ చేశారు. దాదాపు రూ.12.50 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం..
గణేష్​పథ్​లోని ఎంప్రెస్​మాల్​ ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్​ చేస్తున్నారు. అ సమయంలో మనోజ్​ నందన్​వార్​ అనే వ్యక్తి వారికి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి కారును పోలీసులు తనిఖీ చేయగా ఒక గోనె సంచి నిండా నకిలీ పిస్తా పప్పులు, వేరుశనగ పప్పులు లభించాయి. సమాచారాన్ని వారు వెంటనే ఉన్నతాధికారులకు అందించారు. అనంతరం నకిలీ పిస్తాలను తయారుచేస్తున్న స్థావరంపై పోలీసులు రైడ్​ చేశారు.

వేరుశనగలకు ఆకుపచ్చ రంగు

3 బస్తాల నకిలీ పిస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. స్థావరాన్ని పోలీసులు పరిశీలించగా ఇద్దరు కార్మికులు పైఅంతస్తులో వేరుశనగలను మెషీన్​తో కత్తిరించి ఆరబెట్టడం కనిపించింది. దిలీప్​ పారికర్​ను ప్రశ్నించగా రూ. 70 కి వేరుశనగలను బయట కొనుగోలు చేసి పిస్తాలుగా మార్చి, అనంతరం వాటిని మార్కెట్​లో రూ.1100 అమ్మతున్నట్లు చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details