Gujarat drug bust: గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. డ్రగ్స్ తయారుచేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ).. రూ.వెయ్యి కోట్లకు పైగా మత్తుపదార్థాలను సీజ్ చేశారు. ఇటీవలి కాలంలో పట్టుబడిన డ్రగ్స్‌లో ఇది అతిపెద్దదని పోలీసులు పేర్కొన్నారు.
నిఘా వర్గాల సమాచారం మేరకు భరూచ్‌లోని అంక్లేశ్వర్‌లో ముంబయి ఏఎన్సీ రైడ్లు నిర్వహించింది. ఇక్కడ ఉన్న ఓ ఫ్యాక్టరీపై దాడులు చేసింది. ఏకంగా 513 కేజీల మెఫెడ్రోన్ అనే మత్తు పదార్థాలను ముంబయి యాంటీ నార్కోటిక్స్ సెల్(ఏఎన్సీ) సీజ్ చేసింది. ఈ కేసులో ఓ మహిళతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ రూ.1026 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ యూనిట్ తయారీ యజమాని గిరిరాజ్ దీక్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆగస్టు 3వ తేదీన కూడా ముంబయి యాంటీ నార్కొటిక్స్ సెల్ భారీగా డ్రగ్స్‌ను సీజ్ చేసింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.