తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'డ్రగ్స్​ పార్టీ'పై దాడులు- పట్టుబడ్డ స్టార్ హీరో తనయుడు! - బాలీవుడ్ డ్రగ్ పార్టీ

ముంబయిలో జరిగిన డ్రగ్ పార్టీపై (Mumbai Rave party news) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు జరిపింది. పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. ఈ పార్టీలో బాలీవుడ్ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారని ఎన్​సీబీ అధికారులు తెలిపారు. ఓ సూపరస్టార్ కుమారుడు సైతం ఇందులో ఉన్నట్లు చెప్పారు.

MUMBAI NARCOTICS
బాలీవుడ్ ప్రముఖుల డ్రగ్ పార్టీ

By

Published : Oct 3, 2021, 7:42 AM IST

Updated : Oct 3, 2021, 10:29 AM IST

'డ్రగ్స్​ పార్టీ'పై దాడులు

ముంబయి తీరంలో క్రూజ్​​ షిప్​లో జరిగిన రేవ్ పార్టీపై (Mumbai Rave party news) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించింది. పార్టీలో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న అనుమానంతో తనిఖీలు చేసింది. శనివారం అర్ధరాత్రి ఈ పార్టీ జరిగింది. కొకైన్, హషీష్, ఎండీ వంటి మాదకద్రవ్యాలు పార్టీలో దొరికినట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిలో బాలీవుడ్ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు ఎన్​సీబీ వర్గాలు వెల్లడించాయి. ఓ సూపరస్టార్ కుమారుడు సైతం ఇందులో ఉన్నట్లు తెలిపాయి.

మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్​సీబీ వెల్లడించింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపింది. పార్టీ ఆర్గనైజర్లకు సమన్లు జారీ చేసింది. ఆదివారం ఉదయం 11 లోగా కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.

సముద్రం మధ్యలో పార్టీ

విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎన్​సీబీ అధికారులు.. తమని తాము ప్యాసింజర్లుగా పరిచయం చేసుకొని నౌకలోకి ప్రవేశించారు. ఈ నౌక గోవాకు వెళ్లినట్లు తెలిపారు. ముంబయి తీరం నుంచి నౌక బయల్దేరి సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత పార్టీ ప్రారంభమైందని చెప్పారు.

ఈ కేసులో ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని ఎన్​సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే పేర్కొన్నారు. పార్టీలో పాల్గొన్న కొందరిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. పలు మాదకద్రవ్యాల​ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సెలెబ్రిటీలు ఎవరైనా పార్టీలో ఉన్నారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు వాంఖెడే. దానిపై మాట్లాడలేనని చెప్పారు.

ఇదీ చదవండి:డ్రగ్స్​ దందాలో 'సింగం' నటుడు అరెస్టు

Last Updated : Oct 3, 2021, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details