జాతి పిత మహాత్మ గాంధీ ఏది చెప్పినా అది ఆచరణలో పెట్టేవారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కేరళలోని సొంత నియోజకవర్గం వయనాడ్లో తొలి రోజు పర్యటనలో ఉన్న రాహుల్.. జాతి పిత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహాన్ని చూసినప్పుడు ఆయన చేసిన మంచి పనులు, జీవనశైలి గుర్తుకు వస్తాయని చెప్పారు.
"భారత్.. మతసహనం పాటించాలని చెప్పారంటే.. గాంధీజీ కూడా సహనశీలిగా ఉండేవారు. మహిళలను గౌరవించాలని చెప్పారంటే.. తానూ పాటించేవారు. భారత్.. లౌకిక దేశంగా ఉండాలని అన్నారంటే తానూ అలాగే వ్యవహరించేవారు."