కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. గంగానది తనను పిలుస్తోందని నాడు వ్యాఖ్యలు చేసిన వారే.. ఇప్పుడు ఆ నది విలపించేలా చేస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. గంగానదిలో శవాలు కొట్టుకురావడంపై ప్రధాని మోదీని ట్విట్టర్ వేదికగా శనివారం విమర్శించారు.
1,140 కిలోమీటర్ల గంగానది తీర ప్రాంతంలో ఇప్పటివరకు 2000లకు పైగా శవాలను గుర్తించినట్లు పేర్కొన్న ఓ వార్తను తన ట్వీట్‌కు రాహుల్ జోడించారు.