కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్ గాంధీ(rahul gandhi news) నుంచి ఎట్టకేలకు సానుకూల స్పందన వచ్చింది. దిల్లీలో శుక్రవారం.. సీడబ్ల్యూసీ సమావేశం(congress cwc meeting) జరగ్గా రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని నేతలు మరోమారు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది(congress news). ఈ విషయంపై ఇన్ని రోజులు మౌనంగా ఉన్న రాహుల్.. తాజాగా జరిగిన భేటీలో 'అధ్యక్ష పదవి గురించి ఆలోచిస్తాను' అని వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ విషయంపై సిద్ధాంతాల స్థాయి నుంచి స్పష్టత అవసరమని, రాజకీయ నేతలు తమ నిర్ణయాన్ని వెల్లడించాలని రాహుల్ తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేంత వరకు రాహుల్.. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగాలని పలువురు సీనియర్లు అభిప్రాయపడినట్టు సమాచారం.
2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్. ఆ తర్వాత సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే రాహుల్ తిరిగి పదవిని చేపట్టాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికలు అప్పుడే..
సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు 2022 ఆగస్టు 21- సెప్టెంబర్ 20 మధ్య జరుగుతుందని(congress president election) పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
- సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌కు సీడబ్ల్యూసీ ఆమోదం
- నవంబర్ 1 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం
- 2022 ఏప్రిల్‌లో అధ్యక్ష పదవికి నామినేషన్ల స్వీకరణ
- 2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21 వరకు సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నిక
- 2022 అక్టోబర్ 31 నాటికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తి