తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సిన్​పై మోదీకి రాహుల్ నాలుగు ప్రశ్నలు

కరోనా వ్యాక్సిన్ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుగు ప్రశ్నలు వేశారు. ఏ వ్యాక్సిన్​ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది? ఎందుకు కొనుగోలు చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ పంపిణీ వ్యూహాన్ని వెల్లడించాలని కోరారు.

Rahul poses questions on vaccination strategy
వ్యాక్సిన్​పై మోదీకి రాహుల్ నాలుగు ప్రశ్నలు

By

Published : Nov 23, 2020, 10:00 PM IST

కొవిడ్-19 వ్యాక్సిన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస ప్రశ్నలు సంధించారు. ఈ విషయమై నాలుగు ప్రశ్నలు వేసిన రాహుల్.. దేశ ప్రజలకు తప్పనిసరిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు? పీఎం కేర్ నుంచి డబ్బులు ఖర్చు చేస్తున్నారా? అనే ప్రశ్న వేశారు.

తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి రాహుల్ సంధించిన ప్రశ్నలు..

  • 1. ఇప్పటి వరకు బయటికి వచ్చిన వ్యాక్సిన్లలో భారత ప్రభుత్వం ఏ వ్యాక్సిన్ తీసుకుంటోంది? అదే ఎందుకు తీసుకోవాలనుకుంటోంది?
  • 2. మొదటి వ్యాక్సిన్ ఎవరు తీసుకోబోతున్నారు? పంపిణీకి సంబంధించిన వ్యూహం ఏమిటి?
  • 3. ఫ్రీ వ్యాక్సిన్ కోసం పీఎం కేర్స్ ఫండ్ వినియోగిస్తున్నారా?
  • 4. ఇండియాలోని అందరికీ వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు?

ఈ నాలుగు ప్రశ్నలు వేసిన రాహుల్ గాంధీ.. వీటిపై దేశ ప్రజలకు మోదీ తప్పనిసరిగా సమాధానం చెప్పాలని ట్విట్టర్​లో రాసుకొచ్చారు.

బిహార్ ఎన్నికల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రకటన చేశారు. అది కూడా ప్రజలకు ఉచితంగా వేస్తామని చెప్పారు. అయితే బిహార్ ఎన్నికల దృష్ట్యా దీనిపై రాజకీయ దుమారం రేగింది. వెంటనే దేశంలోని అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని సవరించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details