తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rahul On China New Map : 'మోదీవి అబద్ధాలని ఏళ్లుగా చెప్తున్నా.. చైనా మ్యాప్‌పై ప్రధాని ప్రకటన చేయాల్సిందే' - రాహుల్​ గాందీ తాజా కామెంట్స్​

Rahul On China New Map : భారత భూభాగాలైన అరుణాచల్, అక్సాయ్‌చిన్‌లను తమవిగా చూపుతూ చైనా మ్యాప్‌ విడుదల చేయడం తీవ్రమైన విషయమని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పొరుగుదేశం ఇప్పటికే లద్దాఖ్‌లో భూభాగాన్ని లాక్కుందన్న రాహుల్... ఈ విషయంలో ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Rahul On China New Map
Rahul On China New Map

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 12:07 PM IST

Updated : Aug 30, 2023, 12:18 PM IST

Rahul On China New Map : అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ చైనా విడుదల చేసిన మ్యాప్‌పై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ స్పందించారు. ఈ విషయంపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చైనా దురాక్రమణ విషయంలో ప్రధాని చెప్పే మాటలు అబద్ధమని రాహుల్​ మరోసారి ఆరోపించారు.

"లద్దాఖ్‌లో అంగుళం భూమిని కూడా చైనా ఆక్రమించలేదని మోదీ మనకు చెప్తున్నారు. కానీ ఆ మాటలు అబద్ధమని నేను కొన్నేళ్లుగా మొత్తుకుంటున్నాను. లద్దాఖ్‌ ప్రజలందరికీ చైనా దురాక్రమణ గురించి తెలుసు. చైనా విడుదల చేసిన మ్యాప్‌ అంశం చాలా తీవ్రమైనది. మన భూభాగాన్ని వారు లాగేసుకున్నారు. ప్రధాని మోదీ ఈ అంశంపై ప్రకటన చేయాలి" అని రాహుల్ డిమాండ్ చేశారు.

లద్దాఖ్​లో సుమారు పది రోజులపాటు పర్యటించిన రాహుల్​ గాంధీ.. మంగళవారమే దిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఆయన కర్ణాటక బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలోనే చైనా మ్యాప్​ వివాదంపై దిల్లీ ఎయిర్​పోర్ట్​లో మాట్లాడారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం గృహలక్ష్మి యోజనను బుధవారం.. ప్రారంభించనుంది. మైసూర్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ పాల్గొననున్నారు. ఇప్పటికే రాహుల్​ అక్కడికి చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్​పోర్ట్​లో రాహుల్​కు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్​ స్వాగతం పలికారు.

'సరిహద్దుల వివాదాలను మరింత రగల్చడమే'
China New Map Issue : అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయ్‌ చిన్‌లను తమ భూభాగంలో చూపుతూ చైనా రూపొందించిన మ్యాప్‌పై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇది సరిహద్దుల వివాదాలను మరింత రగల్చడమేనని అభిప్రాయపడింది. చైనా ఆధారాల్లేకుండా మ్యాప్‌ను రూపొందించిందని స్పష్టం చేసింది. "అసంబద్ధమైన వాదనల ద్వారా ఇతరుల భూభాగాలను తమవని చెప్పుకోజాలరు" అని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. తాము దౌత్యపరమైన మార్గాల్లో చైనాకు గట్టి నిరసనను తెలియజేశామని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందం బాగ్చీ తెలిపారు. భారత్‌ కొద్ది రోజుల్లో జి-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం.

Last Updated : Aug 30, 2023, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details