తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజల జేబులను కొల్లగొడుతున్న ప్రభుత్వం' - కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్​

ప్రభుత్వం వద్ద డబ్బు లేనందున.. పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంచి ప్రజల నుంచి డబ్బులు గుంజుతోందని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ పతనమవ్వడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలే కారణమని విమర్శించారు.

Rahul hits out at Centre over rising fuel prices
'ప్రజల జేబులను కొల్లగొడుతున్న ప్రభుత్వం'

By

Published : Mar 22, 2021, 4:56 PM IST

Updated : Mar 22, 2021, 5:20 PM IST

చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల జేబుల నుంచి డబ్బు లాక్కుని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.

కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొచ్చిలోని సెయింట్​ థెరెస్సా మహిళా కళాశాల విద్యార్థులతో రాహుల్​ మచ్చటించారు. ఆర్థిక వ్యవస్థ పతనమవ్వడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని దుయ్యబట్టారు.

"సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రజల చేతికి డబ్బులు ఇవ్వడం ఒకటే మార్గం. కానీ, ప్రభుత్వం మాత్రం ఆ పని చేయకుండా ఉత్పత్తి పెంచండి అని చెబుతోంది. జీఎస్టీ వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కరోనా మహమ్మారి వల్ల అది పూర్తిగా నాశనమైంది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. సంపదను సృష్టించలేకపోతోంది. అందుకే.. పెట్రోల్​, డీజిల్​ పేరుతో ప్రజల వద్ద నుంచి డబ్బు లాక్కుంటోంది."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో నడవాలంటే.. ప్రశాంత వాతావరణం కీలక పాత్ర పోషిస్తుందని రాహుల్​ అన్నారు.

Last Updated : Mar 22, 2021, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details