దేశవ్యాప్తంగా కరోనా(Covid-19) సెకండ్ వేవ్ వ్యాప్తికి ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మరణాల రేటును కేంద్రం దాస్తోందని ఆరోపించారు. కరోనా పరిస్థితులపై రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కొవిడ్ విజృంభణ క్రమంలో తాము కేంద్రాన్ని హెచ్చరించినా.. పట్టించుకోలేదన్నారు.
Covid-19: 'మోదీ విధానాలతోనే సెకండ్ వేవ్ విజృంభణ' - rahul gandi latest news
దేశంలో కొవిడ్(Covid-19) రెండో దశ విజృంభణకు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్‌లో ప్రస్తుత కరోనా(Covid-19) మరణాల రేటును కేంద్రం దాస్తోందన్నారు. కరోనా పరిస్థితులపై రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశం అందించారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
లాక్డౌన్లు, మాస్కులు ధరించటం తాత్కాలిక పరిష్కారమని.. వ్యాక్సినేషన్ మాత్రమే కొవిడ్‌కు శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :cyclone yaas: తుపాను ప్రభావంపై మోదీ సమీక్ష