తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పుడు రాహుల్‌ గాంధీ పిక్నిక్‌కు వెళ్లారు' - రాహుల్ పై ​ఆర్జేడీ విమర్శలు

కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీపై.. ఆర్జేడీ ఉపాధ్యక్షుడు తీవ్ర ఆరోపణలు చేశారు. బిహార్​ ఎన్నికల్లో మహాకూటమి ఓటమికి కాంగ్రెస్ పార్టీనే కారణమని అన్నారు. పార్టీ నడిపే తీరు రాహుల్​కు తెలియదని ఘాటుగా విమర్శించారు.

rahul gandhi went for picnic while bihar elections were held
'అప్పుడు రాహుల్‌ గాంధీ పిక్నిక్‌కు వెళ్లారు'

By

Published : Nov 16, 2020, 1:05 PM IST

Updated : Nov 16, 2020, 2:02 PM IST

బిహార్‌ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాకూటమి 110 స్థానాలు గెలిచినప్పటికీ అధికారం లభించలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తారుమారు చేస్తూ 125 స్థానాలను కైవశం చేసుకున్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు విజయావకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఆర్జేడీ సీనియర్‌ నేత శివానంద్‌ తివారీ చేసిన విమర్శతో ఈ అసంతృప్తి మరింత స్పష్టమైంది.

70 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్‌.. కనీసం 70 ప్రచార సభలు కూడా నిర్వహించలేదు. ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ కేవలం మూడు రోజుల పాటు బిహార్‌కు వచ్చారు. ప్రియాంకా గాంధీ వాద్రా అయితే అసలు రానేలేదు. దేశమంతా బిహార్‌ ఎన్నికల వైపు దృష్టి కేంద్రీకరించిన సమయంలో.. రాహుల్‌ తన సోదరి ప్రియాంక ఇంట్లో పిక్నిక్‌ చేసుకున్నారు. బిహార్‌కు ఏ మాత్రం పరిచయం లేనివారు ఇక్కడ ప్రచారం చేసేందుకు వచ్చారు. పార్టీని నడిపే తీరు ఇదేనా? ఇది సరి కాదు.

- శివానంద్‌ తివారీ,ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు

అధిక స్థానాల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే కాంగ్రెస్‌.. ఆ సీట్లను గెలుచుకునేందుకు కృషి చేయదన్నారు. బిహార్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ ఇదే వైఖరి ప్రదర్శిస్తుందని శివానంద్‌ విమర్శించారు. దీనిని గురించి ఆ పార్టీ పునరాలోచన చేయాలని హితవు పలికారు.

ఇదీ చూడండి: కేంద్ర మంత్రివర్గంలోకి సుశీల్​ కుమార్​ మోదీ..?

Last Updated : Nov 16, 2020, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details