తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్ 'టీకా' ట్వీట్‌కు హర్షవర్ధన్‌ కౌంటర్‌

అహంకారానికి, అజ్ఞానం అనే వైరస్​కు వ్యాక్సిన్లు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"Its July, where are vaccines?" Rahul Gandhi tweets, Health Minister hits back
కాంగ్రెస్‌ నేత 'వ్యాక్సిన్‌' ట్వీట్‌కు హర్షవర్ధన్‌ కౌంటర్‌

By

Published : Jul 2, 2021, 3:41 PM IST

దేశంలో కరోనా టీకాల కొరతపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీకాల సరఫరా గురించి కేంద్రం చేసిన ప్రకటనను రాహుల్‌ అర్థం చేసుకోలేకపోతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కాంగ్రెస్‌ నేత 'వ్యాక్సిన్‌' ట్వీట్‌కు హర్షవర్ధన్‌ కౌంటర్‌

కరోనా టీకాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ రాహుల్‌ ఈ ఉదయం ఓ ట్వీట్‌ చేశారు. "జులై వచ్చింది.. వ్యాక్సిన్లు రాలేదు" అని పేర్కొన్నారు. దీనికి 'Wherearevaccines' అనే హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు. అయితే ఈ ట్వీట్‌కు హర్షవర్ధన్‌ బదులిస్తూ.. రాహుల్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. "జులై నెలలో వ్యాక్సిన్‌ లభ్యత గురించి నిన్ననే నేను ప్రకటన చేశాను. అయినా రాహుల్‌ సమస్య ఏంటో? ఆయన చదవలేరా? లేదా అర్థం కాలేదా? అహంకారం, నిర్లక్ష్యం వంటి వైరస్‌లకు ఎలాంటి టీకా లేదు! నాయకత్వ మార్పుల గురించి కాంగ్రెస్‌ ఆలోచించాల్సిందే!!" అని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ ట్వీట్

అటు మరో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా స్పందిస్తూ.. రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. "జులైలో 12 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉండనున్నాయి. ఇవి గాక, ప్రైవేటు ఆసుపత్రులకు మరికొన్ని సరఫరా కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను 15 రోజుల ముందే రాష్ట్రాలకు తెలియజేశాం. కరోనాపై పోరాటంలో తీవ్రమైన విషయాలను పక్కనబెట్టి రాజకీయాలు చేయడం మంచిది కాదనే విషయాన్ని రాహుల్‌ గాంధీ అర్థం చేసుకోవాలి" అని గోయల్‌ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details