కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు వ్యవసాయం రంగాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఐదుగురే దేశాన్ని శాసిస్తున్నారని, దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని వ్యాఖ్యానించారు.
'వ్యవసాయ రంగం నాశనానికే ఆ చట్టాలు' - వ్యవసాయ రంగాన్ని నాశనం చేయనున్న వ్యవసాయ చట్టాలు
వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఒరిగేదేమీలేదని, అవి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేందుకే తెచ్చారని కేంద్రంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వ్యవసాయ చట్టాలపై బుక్లెట్ విడుదల చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
'రైతు ఉద్యమంపై కేంద్రం దుష్ప్రచారం చేస్తోంది'
సాగు చట్టాలతో కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్ రూపొందించిన బుక్లెట్ను దిల్లీలో విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాహుల్. నిజాన్ని దాచిపెట్టి, కేంద్రం దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. జరగబోయే పెను విషాదాన్ని కేంద్రం అశ్రద్ధ చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన సన్నిహితులకు దేశాన్ని కట్టబెట్టారని ఆరోపించారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేందుకే తెచ్చారని కేంద్రంపై ధ్వజమెత్తారు రాహుల్.
Last Updated : Jan 19, 2021, 2:48 PM IST