కేంద్రాన్ని ప్రశ్నించిన వారు జైలుపాలు అవుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం, పెట్రో ధరల పెంపునకు సంబంధించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా కేంద్రంప విమర్శల దాడికి దిగారు.
"ఈ వాక్యాన్ని పూరించండి : స్నేహం కోసం రఫేల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, పన్ను వసూలు కోసం పెట్రో ధరలు పెంచారు, విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారు. ప్రశ్నించిన వారికి జైలు శిక్ష, మోదీ ప్రభుత్వం ......" అని రాహుల్ ట్వీట్ చేశారు.