వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డు స్థాయిలో జరుగుతోందన్న కేంద్రం ప్రకటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News). 'ఈవెంట్ ముగిసింది' అని ట్వీట్(Rahul Gandhi Tweet) చేశారు.
శుక్రవారం.. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో(Vaccination Record India) వ్యాక్సినేషన్ జరిగింది. ఒక్కరోజే 2. 5 కోట్ల మందికి టీకాలిచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్(Rahul Gandhi News Today) వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
గత 10 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉందో తెలిపే కొవిన్ వెబ్సైట్ గ్రాఫ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు రాహుల్ గాంధీ. రికార్డు పంపిణీ అనంతరం వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతలా పడిపోవడమేంటని ప్రశ్నించారు.