తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2021, 8:05 PM IST

ETV Bharat / bharat

'టీకా ధరలను నియంత్రించడంలో మోదీ సర్కార్​ విఫలం'

కరోనా టీకా ధరలను కట్టిడి చేయడంలో మోదీ సర్కారు విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. టీకా అభివృద్ధి చేసేందుకు ప్రజల సొమ్ము చెల్లించిన ప్రభుత్వం.. తిరిగి వాటిని కొనేందుకు ఎందుకు అంత ఎక్కువ మొత్తం చెల్లిస్తోందని అన్నారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలను భాజపా నేత హిమంత బిస్వా తిప్పికొట్టారు.

Rahul Gandhi, vaccine rate
'టీకా ధరలను నియంత్రించడంలో మోదీ సర్కార్​ విఫలం'

కరోనా టీకాలు అధిక ధరలను నియంత్రించడంలో మోదీ సర్కార్​ మరోసారి విఫలమైందని అన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. టీకాను అభివృద్ధి చేయడానికి సంబంధిత కంపెనీలకు ప్రజల డబ్బు ఖర్చు చేసిన ప్రభుత్వం.. వాటిని తిరిగి కొనేందుకు ప్రపంచంలోనే ఎక్కడా లేనంత ధరను చెల్లిస్తోందని మండిపడ్డారు. ప్రధాని తన మిత్రులకు లాభం చేకూర్చేందుకు ఇలా చేస్తున్నారని విమర్శించారు.

టీకా పంపిణీలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయిందని కాంగ్రెస్ నాయకుడు జయ్​రామ్​ రమేశ్​​ ఆరోపించారు. ఆగస్టు నాటి 30 కోట్ల మందికి వ్యాక్సిన్​ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినట్లు గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు మొదటి డోస్​ను 12.12 కోట్ల మందికి మాత్రమే ఇచ్చిందని.. పూర్తిస్థాయిలో టీకా వేయింకున్న వారు కేవలం 2.36 కోట్ల మంది మాత్రమే అని అన్నారు.

టీకా అధిక ధరలు, వ్యాక్సిన్​ పంపణీపై కాంగ్రెస్​ చేస్తోన్న ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. టీకా పంపిణీపై రాహుల్​ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని భాజపా నేత హిమంత బిస్వా శర్మ విమర్శించారు. 'మేడ్ ఇన్ ఇండియా' వ్యాక్సిన్లపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రాహుల్​ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వ్యాక్సిన్​లను ఎంచుకోవద్దని హితవుపలికారు. కరోనా టీకాల అధిక ధరలపై రాహుల్​ ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టీకా ధర భరించలేని వారికి ప్రధాని ఉచిత టీకా ఇస్తారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:వ్యాక్సిన్ ధర తగ్గించిన సీరం సంస్థ

ABOUT THE AUTHOR

...view details