తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ భయంతోనే ఇందిరను విస్మరించిన మోదీ సర్కార్' - విజయ్​ దివస్​

Rahul Gandhi rally in Dehradun: 1971 యుద్ధంలో విజయం సాధించటంపై గురువారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్రంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. నిజానిజాలకు భయపడే ఇందిరా గాంధీని విస్మరించారని ఆరోపించారు. ఉత్తరాఖండ్​లోని చాలా కుటుంబాల మాదిరిగానే తన కుటుంబం సైతం త్యాగాలు చేసిందని పేర్కొన్నారు.

rahul-gandhi-rally
రాహుల్​ గాంధీ

By

Published : Dec 16, 2021, 4:10 PM IST

Updated : Dec 16, 2021, 5:31 PM IST

Rahul Gandhi rally in Dehradun: ఉత్తరాఖండ్​లోని చాలా కుటుంబాల మాదిరిగానే తన కుటుంబం సైతం దేశం కోసం త్యాగాలు చేసిందని పేర్కొన్నారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఇదే ఆ రాష్ట్రంతో తనకు ఉన్న సంబంధమని తెలిపారు. 1971లో పాకిస్థాన్​పై యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దెహ్రాదూన్​లోని పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు రాహుల్​.

1971లో జరిగిన యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే పాకిస్థాన్​.. భారత్​ ముందు తలవంచిందని తెలిపారు రాహుల్​. సాధారణంగా యుద్ధం అంటే 6 నెలలు, 1-2 ఏళ్లు పడుతుందన్నారు. అఫ్గానిస్థాన్​ను ఓడించేందుకు అమెరికాకు 20 ఏళ్లు పట్టిందని, కానీ, యావత్​ భారత్ ఒక్కటిగా నిలిచి.. 13 రోజుల్లోనే పాకిస్థాన్​ను మట్టి కరిపించిందని గుర్తు చేసుకున్నారు.

" బంగ్లాదేశ్​ యుద్ధంపై దిల్లీలో ఈరోజు ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో ఇందిరా గాంధీ గురించి ఎక్కడా చెప్పలేదు. ఆమె ఈ దేశం కోసం 32 తూటాలకు ఎదురొడ్డి నిలిచారు. నిజాలకు భయపడే ఆమెను విస్మరించారు. ఉత్తరాఖండ్​లోని చాలా కుటుంబాల మాదిరిగానే నా కుటుంబం సైతం త్యాగాలు చేసింది. అదే ఈ రాష్ట్రంతో నాకు ఉన్న సంబంధం."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

రాహుల్​ సభలో రావత్​ కటౌట్​..

కాంగ్రెస్​ సభలో సీడీఎస్​ బిపిన్​ రావత్​ కటౌట్​

దెహ్రాదూన్​లో గురువారం నిర్వహించిన కాంగ్రెస్​ సభలో సీడీఎస్​ రావత్​ భారీ కటౌట్​ కనిపించింది. ఓ వైపు ఇందిరా గాంధీ, మరోవైపు రాహుల్​ గాంధీ మధ్యలో రావత్​ కటౌట్​ ఏర్పాటు చేశారు. భారత తొలి త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్​పై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి ఆరోపణలు చేశారు. తాజాగా కాంగ్రెస్​ సభలో రావత్​ కటౌట్​ కనిపించటం వల్ల.. సీఎం ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.

బిపిన్​ రావత్​ కటౌట్​

ఇదీ చూడండి:జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు ప్రధాని నివాళి

బంగ్లాదేశ్ విజయ్ దివస్​లో కోవింద్.. 1971 నాటి 'మిగ్' బహూకరణ

Last Updated : Dec 16, 2021, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details