భారత్లో కొవిడ్ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందిస్తున్న దేశాల జాబితాను ట్విట్టర్లో షేర్ చేశారు.
"ప్రపంచంలో 23 లక్షల మందికి కొవిడ్ టీకా అందింది. చైనా, యూఎస్, యూకే, రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ అందించడం ప్రారంభించాయి. మరి మన వంతు ఎప్పుడు వస్తుంది మోదీ?"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.