తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ గాంధీ ఒక 'రాజకీయ కోకిల': భాజపా - రాజకీయ కోకిల

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై(rahul gandhi news) విమర్శలు గుప్పించింది భాజపా. ఇతర పక్షుల గూళ్లపై ఆధారపడే కోకిల మాదిరిగా రాహుల్​ నడుచుకుంటున్నారని, భారత రాజకీయాల్లో రాహుల్​ ఒక 'రాజకీయ కోకిల' అని అభివర్ణించింది. తన రాజకీయాల కోసం ఇతరుల కష్టాన్ని వాడుకుంటారని ఆరోపించింది.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ, సంబిత్​ పాత్ర

By

Published : Sep 6, 2021, 6:12 PM IST

కేంద్రంపై తరుచుగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీపై(rahul gandhi news) వ్యంగ్యస్త్రాలు సంధించింది భాజపా. రాహుల్​ గాంధీ 'భారత రాజకీయాల్లో ఒక రాజకీయ కోకిల' అని అభివర్ణించింది. రాహుల్​.. పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పని చేయాలనుకోరని, తన రాజకీయ ఎజెండా కోసం ఇతరుల కష్టాన్ని వాడుకుంటారని ఎద్దేవా చేసింది. కోకిల కూడా సొంతంగా తన గూటిని నిర్మించుకోలేదని.. ఇతర పక్షుల గూళ్లలో స్థావరాన్ని వెతుక్కుంటుందని గుర్తుచేసింది.

ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​పుర్​లో రైతులు నిర్వహించిన మహాపంచాయత్​పై.. పాత చిత్రాలను రాహుల్​ గాంధీ షేర్​ చేయటంపై విమర్శలు గుప్పించారు భాజపా అధికార ప్రతినిధి(bjp spokesperson) సంబిత్​ పాత్ర. ఇది అబద్ధాలు వ్యాప్తి చేయటం, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు చేసే రాజకీయాల్లో భాగమని ఆరోపించారు.

" కాంగ్రెస్​కు పూర్తిస్థాయి అధ్యక్షుడు లేరు. దాంతో క్షేత్రస్థాయిలోని సమస్యలను లేవనెత్తలేకపోతున్నారు. అందుకే సోనియా గాంధీ ఇతర పార్టీల నేతలతో వర్చువల్​గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు రాహుల్​ గాంధీ పాత చిత్రాలపై ఆధారపడుతున్నారు. కోకిల తన గూటిని నిర్మించుకోలేదు. ఇతర పక్షుల గూళ్లలో స్థావరాన్ని వెతుక్కుంటుంది. రాహుల్​ గాంధీ సైతం అలాగే వ్యవహరిస్తున్నారు. తన పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన పనిచేయాలనుకోరు. తన రాజకీయాల కోసం ఇతరుల కష్టాన్ని వాడుకునే అలవాటుతోనే అలా చేస్తారు. "

- సంబిత్​ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి.

మోదీ ప్రభుత్వం ఎప్పుడూ రైతుల బాగు కోసమే పని చేస్తోందని, ఎప్పటికీ చేస్తూనే ఉంటుందన్నారు సంబిత్​ పాత్ర. రైతులకు ఇప్పటి వరకు 1.5 లక్షల కోట్లు పెట్టుబడి సాయం, రికార్డు స్థాయిలో పంట కొనుగోళ్లు చేశామని గుర్తు చేశారు.

మార్నింగ్​ కన్సల్ట్​ సర్వేలో.. 13 దేశాల అధినేతల్లో మోదీ తొలిస్థానంలో నిలవటంపైనా స్పందించారు భాజపా నేత. అది కేవలం ప్రభుత్వ విజయాలతోనే సాధ్యమైందన్నారు. వ్యాక్సినేషన్​పై రాహుల్​ గాంధీ విమర్శలను తిప్పికొట్టారు. ఇటీవల ఒకే రోజులో కోటికిపైగా డోసులు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. మొత్తంగా 68.75 కోట్ల మందికి కనీసం ఒక్క డోసైనా అందినట్లు తెలిపారు. దీనిపై రాహుల్​ గాంధీ కనీసం ఒక్క ట్వీట్​ కూడా చేయలేదన్నారు.

ఇదీ చూడండి:Rahul Gandhi: 'నిరంకుశ వ్యవస్థతో దేశం నలిగిపోతోంది'

ABOUT THE AUTHOR

...view details