తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రాంతీయ పార్టీలా కాంగ్రెస్'.. పాఠాలు నేర్చుకుంటామన్న రాహుల్ - ఎన్నికల ఫలితాలపై రాహుల్​ గాంధీ

Rahul Gandhi on Results: ఐదు రాష్ట్రాల ఎన్నికలల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అన్నారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపారు. మరోవైపు పార్టీ అంచనాలకు తగ్గట్టు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు లేవని కాంగ్రెన్​ ముఖ్య నాయకుడు రణ్​దీప్​ సుర్జేవాలా పేర్కొన్నారు.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ

By

Published : Mar 10, 2022, 5:24 PM IST

Rahul Gandhi on Results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్​ నిరంతరం పని చేస్తుందని ట్వీట్​ చేశారు రాహుల్​.

''ప్రజల తీర్పును గౌరవంగా అంగీకరిస్తున్నాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ ఎన్నికల కోసం పని చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, వాలంటీర్లకు కృతజ్ఞతలు. ఈ ఫలితాల నుంచి మేం నేర్చుకుంటాం. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తాం'' అని రాహుల్‌ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

ప్రజా తీర్పునకు కట్టుబడి ఉన్నాం..

మినీ సార్వత్రికంగా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పార్టీ అంచనాలకు ఏ మాత్రం పొంతన లేకుండా వచ్చాయని కాంగ్రెస్ తెలిపింది. ఏదేమైనా ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా పేర్కొన్నారు. పంజాబ్​ ప్రజల్లో అమరీందర్​ సింగ్​ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తాము అంచనా వేయడంలో విఫలం అయినట్లు చెప్పారు. అందులోనూ పంజాబ్​ ప్రజలు మార్పును కోరుకొని ఓటు వేశారని వివరించారు. తాము కేవలం ఎన్నికల్లోనే ఓడిపోయామని.. ధైర్యాన్ని కాదని అన్నారు. సరికొత్త వ్యూహాలతో మరోసారి బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు.

ప్రాంతీయ పార్టీలా కాంగ్రెస్​..

ఐదు రాష్ట్రాల ఫలితాలను చూస్తే.. ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన కాంగ్రెస్​ పార్టీ కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయిందని కేంద్ర మాజీ మంత్రి అశ్వినీ కుమార్​ అన్నారు. తాజా ఫలితాల్లో పార్టీ పేలవమైన ప్రదర్శనను కనబరిచిందని చెప్పుకొచ్చారు. పంజాబ్​లో ఆమ్ ఆద్మీ పార్టీఅద్భుత విజయం సాధించిందని అన్నారు. ఈ విజయం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతుందని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details