Rahul Gandhi booster dose: కరోనా టీకా బూస్టర్ డోసు పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన సిఫార్సులను స్వీకరించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. తన సూచనలను ఆమోదించి.. బూస్టర్ డోసులు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిందని అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికీ టీకా/బూస్టర్ డోసు అందాలని ఆకాంక్షించారు.
Booster dose in India
శనివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోదీ.. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. జనవరి 10 నుంచి 'ప్రికాషన్ డోసు' పేరుతో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది సరైన దిశలో ముందడుగు అని పేర్కొన్నారు.