తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లండన్​లో స్పీచ్​ కోసం రాహుల్​ గాంధీ కొత్త లుక్​ - rahul gandhi england latest news

తాను చదువుకున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు లండన్​ వెళ్లిన కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కొత్త లుక్​లో కనిపించారు. ప్రస్తుతం ఈ స్టైలిష్​ లుక్​కు సంబంధించిన ఆయన ఫొటోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Rahul Gandhi New Look
కొత్త లుక్​లో రాహుల్​ గాంధీ

By

Published : Mar 1, 2023, 1:29 PM IST

Updated : Mar 1, 2023, 3:48 PM IST

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన ఉపన్యాసానికి ముందు కొత్త లుక్​లో కనిపించారు. ఇంగ్లాండ్​లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు లండన్​ వెళ్లిన ఆయన ఇలా స్టైలిష్​ లుక్​లో కనిపించారు. 52 ఏళ్ల​ రాహుల్​ కొత్త లుక్​కు సంబంధించిన ఫొటోలను కొందరు అభిమానులు పలు హ్యాష్​ట్యాగ్​లతో సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

గతేడాది భారత్​ జోడో యాత్రలో భాగంగా 12 రాష్ట్రాలను చుట్టిన రాహుల్​ తన జుట్టు, గడ్డం పెంచారు. అనేక నెలల తర్వాత ఇప్పుడు జుట్టు, గడ్డాన్ని కత్తిరించుకుని కొత్త లుక్​లో కనిపించారు. పాదయాత్ర తర్వాత హెయిర్​ కట్​, ట్రిమ్మింగ్​ చేయించి, ఇలా స్టైలిష్​గా కనిపించడం ఇదే తొలిసారి. లండన్​లో రాహుల్​ పర్యటన వారం పాటు సాగనుంది. ఇందుకోసం ఆయన మంగళవారం ఇంగ్లాండ్​కు చేరుకున్నారు. లండన్​కు వెళ్లేముందు గత నెల 24 నుంచి 26 వరకు ఛత్తీస్​గఢ్​లో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాలకు రాహుల్​ గాంధీ హాజరయ్యారు.

జడ్జి బిజినెస్​ స్కూల్​ విద్యార్థులను ఉద్దేశించి "లెర్నింగ్​ టు లిజన్​ ఇన్ ద​ 21st సెంచరీ" అనే అంశంపై స్పీచ్​ ఇవ్వనున్నారు రాహుల్​. కాగా, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో M.Phil. చదివిన రాహుల్​ గాంధీ 1995లో డాక్టరేట్​ పట్టా పొందారు.
కేంబ్రిడ్జ్‌లో రాహుల్ "బిగ్ డేటా అండ్ డెమొక్రసీ"తో పాటు భారత్​-చైనా సంబంధాలు అనే అంశాలపై పలువురు ప్రముఖ ప్రొఫెసర్లతో చర్చించనున్నారు. తమ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమానికి భారత విపక్ష పార్టీ నేత రాహుల్​ గాంధీని అతిథిగా ఆహ్వానించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మంగళవారం ట్వీట్​ చేసింది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం.

కొత్త లుక్​లో రాహుల్​ గాంధీ

ఈ ట్వీట్​ను షేర్​ చేస్తూ.. "నేను చదివిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఉపన్యాసం ఇవ్వడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, బిగ్​ డేటా అండ్​ డెమ`క్రసీ సహా వివిధ అంశాలపై ప్రతిభావంతులైన విద్యార్థులతో మమేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని రాహుల్​ రిప్లై ఇచ్చారు.
గతేడాది మే నెలలో ఇంగ్లాడ్​ పర్యటన సందర్భంగా 'ఇండియా ఎట్​ 75' కార్యక్రమం నిర్వహించిన కార్పస్​ క్రిస్టీ కాలేజ్​లో ప్రసంగించారు రాహుల్​.

Last Updated : Mar 1, 2023, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details