తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జోడో యాత్రలో రాహుల్‌ పెళ్లి ప్రస్తావన.. ఆయన రియాక్షన్ ఇదే! - రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన

Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో ఓ సరదా సన్నివేశం జరిగింది. 'మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం' అని ఓ మహిళ రాహుల్​తో అన్నారు.

rahul gandhi
రాహుల్ గాంధీ

By

Published : Sep 11, 2022, 3:46 PM IST

Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో శనివారం ఓ సరదా సన్నివేశం జరిగింది. ఉదయం యాత్ర కన్యాకుమారి జిల్లా ములగమూడు పట్టణ పంచాయతీ నుంచి మొదలైంది. మధ్యాహ్నం అదే జిల్లా మార్తాండం ప్రాంతంలో భోజన విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ మహిళా కూలీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సంపాదన, కుటుంబ స్థితిగతులు, తీసుకురావాల్సిన మార్పు తదితర అంశాలపై ముచ్చటించారు. మాటల మధ్యలో ఓ మహిళ రాహుల్‌ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు.

"మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని ఓ మహిళ రాహుల్‌ గాంధీతో అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విట్టర్​లో వెల్లడించారు. వారితో మాట్లాడుతున్న సమయంలో రాహుల్‌ చాలా ఉత్సాహంగా కనిపించినట్లు ఆయన చెప్పారు. ఆ సన్నివేశానికి అద్దంపట్టే రెండు ఫొటోలను తన ట్వీట్‌కు జత చేశారు.

మరోవైపు తెలంగాణలోని మేడ్‌పల్లి గ్రామం నుంచి వ్యక్తిగతంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి ఊసయ్య అనే వ్యక్తి యాత్రకు వెళ్లారు. రాహుల్‌గాంధీని కలిశారు. కాసేపు ఆయనతో నడక సాగించారు. శనివారం సాయంత్రం యాత్ర కేరళలోకి ప్రవేశించింది. సరిహద్దులో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీకి ఘనస్వాగతం పలికారు. కేరళలో 18 రోజుల పాటు కార్యక్రమం ఉంటుందని నేతలు తెలిపారు.

ఇవీ చదవండి:21 ఏళ్లుగా గడ్డం పెంచిన వ్యక్తి.. ప్రభుత్వం ఆ పని చేయగానే క్లీన్ షేవ్

జేఈఈ ఫలితాలు విడుదల.. టాపర్​గా శిశిర్

ABOUT THE AUTHOR

...view details