వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నేడు కలవనుంది రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2 కోట్ల మంది సంతకాలు చేసిన మెమోరాండంను ఆయనకు సమర్పించనున్నారు. రాహుల్ అధ్యక్షతన కాంగ్రెస్ ఎంపీలు, ఇతర నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈ వినతిపత్రాన్ని సమర్పించడంతో పాటు, ప్రజాసంక్షేమం దృష్ట్యా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరనున్నారు.
కేంద్రం తెచ్చిన చట్టాల రద్దులో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని, సెప్టెంబర్ నుంచి కాంగ్రెస్ సంతకాల సేకరణ మొదలుపెట్టింది. కూలీలు, రైతులు, వ్యాపారుల నుంచి మొత్తం 2 కోట్లకుపైగా సంతకాలు సేకరించింది. ఇప్పటికే రాహుల్‌గాంధీ అధ్యక్షతన పంజాబ్, హరియాణాలో 'ట్రాక్టర్ ర్యాలీ'ని నిర్వహించింది.
''లక్షలాది రైతులు అత్యంత శీతల వాతావరణంలో.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కానీ.. మోదీ ప్రభుత్వం మాత్రం కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ఆ చట్టాలను తెచ్చింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను దిల్లీ రాకుండా అడ్డుకుంటున్నారు.''