నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనాను నియంత్రించడంలో, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో నరేంద్ర మోదీ విఫలమయ్యారని ఆరోపించారు.
ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్ మరణాలు భారత్‌లో సంభవించాయని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. జీడీపీ వృద్ధిలో అందరికంటే వెనుకంజలో భారత్ ఉందని విమర్శించారు. ఈ మేరకు ఓ పట్టికను తన ట్వీట్‌కు జత చేశారు.
"మోదీ ప్రభత్వ రిపోర్ట్ కార్డు: కరోనా మరణాల్లో అందరికంటే పైన. జీడీపీలో అందరికంటే తక్కువ"