తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీదో మాట.. కేంద్రానిది మరో మాట.. ఎందుకిలా?'

కొవిడ్​ టీకా పంపిణీ విషయంలో ప్రధాని మోదీ అసలు ఉద్దేశమేంటని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ కరోనా టీకా అందించాల్సిన పనిలేదని ఇటీవలే కేంద్రం చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ఈ విధంగా ట్వీట్ చేశారు.

Rahul Gandhi tweet
'కొవిడ్​ టీకా విషయంలో ప్రధాని ఉద్దేశమేంటి?'

By

Published : Dec 3, 2020, 12:52 PM IST

Updated : Dec 3, 2020, 1:05 PM IST

దేశంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని తాము ఎప్పుడూ ప్రకటించలేదని కేంద్రం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అసలు ఉద్దేశమేంటని ప్రశ్నించారు.

" ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్​ అందిస్తామని తొలుత ప్రధాని మోదీచెప్పారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో బిహార్​ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు భాజపా ప్రకటించింది. కానీ, తాము అందరికీ టీకా అందిస్తామని ఎప్పుడూ ప్రకటించలేదని కేంద్రం మాట మార్చింది. ఈ విషయంలో అసలు మోదీ ఉద్దేశం ఏంటి?" అని రాహుల్​ గాంధీ ట్వీట్​ చేశారు.

అందరికీ అవసరంలేదు..

కొవిడ్​ టీకా ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిన అవసరంలేదని ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్​ మీడియా సమావేశంలో వివరించారు. ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రకటనలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్​ కేంద్రంపై ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:'దివ్యాంగుల మెరుగైన జీవితం కోసం సమష్టిగా కృషి అవసరం'

Last Updated : Dec 3, 2020, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details