తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజల బాధ కాదు.. పన్నుల వసూళ్లే మోదీ ప్రభుత్వ లక్ష్యం'

Rahul gandhi comments on economic survey: పన్నుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల బాధలను మాత్రం మోదీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అధిక పన్నులను వసూళ్లు చేయడమే తాము సాధించిన గొప్ప విజయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.

rahul
రాహుల్​

By

Published : Feb 1, 2022, 4:48 AM IST

Rahul gandhi comments on economic survey: అధిక పన్నులను వసూళ్లు చేయడమే తాము సాధించిన గొప్ప విజయంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. పన్నుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల బాధలను మాత్రం మోదీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున ఆర్థిక సర్వే 2021-22ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సభలో ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా ప్రభుత్వానికి రాబడుల్లో పురోగతి, ప్రభుత్వ ఆర్థిక విధానం వల్ల మెరుగైన ఆర్థిక వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. వీటిపై స్పందించిన రాహుల్‌ గాంధీ.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన ధోరణిపై మరోసారి విమర్శలు గుప్పించారు.

'పన్నుల భారంతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం పన్నుల వసూళ్లే భారీ విజయంగా చెప్పుకుంటోంది. ఇక్కడే ప్రభుత్వ ఆలోచనా ధోరణి స్పష్టమవుతోంది. కేవలం వారు సంపదను మాత్రమే చూస్తున్నారు. సామాన్యుల బాధలను మాత్రం పట్టించుకోవడం లేదు' అని ఆర్థిక సర్వేను ప్రస్తావిస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉంటే, కొవిడ్‌ మహమ్మారి కారణంగా క్షీణించిన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడిందని ఆర్థిక సర్వే తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా వృద్ధి కొనసాగుతుందని.. వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. 2024-25 నాటికి ఈ లక్ష్యానికి చేరుకోవాలంటే మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు అవసరమని అభిప్రాయపడింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:'30 ఏళ్ల తర్వాత అన్ని స్థానాల్లో పోటీ.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details