తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్ గాంధీకి మళ్లీ అదే బంగ్లా.. దేశమంతా తన నివాసమేనన్న ఎంపీ.. త్వరలో వయనాడ్ టూర్ - కాంగ్రెస్ రాహుల్ గాంధీ బంగ్లా ఢిల్లీ

Rahul Gandhi Bungalow Delhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి తన అధికారిక నివాసాన్ని తిరిగి కేటాయించారు అధికారులు. ఈ సందర్భంగా స్పందించిన రాహుల్.. భారతదేశం మొత్తం తన నివాసమేనని వ్యాఖ్యానించారు.

rahul gandhi bungalow delhi
rahul gandhi bungalow delhi

By

Published : Aug 8, 2023, 5:01 PM IST

Updated : Aug 8, 2023, 5:31 PM IST

Rahul Gandhi Gets His Bungalow Delhi : లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి.. దిల్లీ తుగ్లక్ లేన్​లో ఉన్న 12వ నంబర్ బంగ్లాను తిరిగి కేటాయించారు. సభ్యత్వం కోల్పోయిన తర్వాత లోక్​సభ సెక్రెటేరియట్ ఆదేశాలతో ఈ ఇంటిని రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. తాజాగా ఎంపీగా తిరిగి నియమితులైన నేపథ్యంలో మళ్లీ ఇదే ఇంట్లో రాహుల్ అడుగుపెట్టనున్నారు. అయితే, భారతదేశం మొత్తం తన ఇల్లేనని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తన అధికారిక నివాసాన్ని తిరిగి పొందడంపై సంతోషంగా ఉన్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పారు.

ఆలోపు రిప్లై ఇస్తేనే...
బంగ్లా కేటాయించినట్లు ఎస్టేట్ కార్యాలయం నుంచి అధికారిక సమాచారం అందిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 'ఇదివరకు రాహుల్ గాంధీ నివసించిన తుగ్లక్ లేన్​లోని 12వ నంబర్ బంగ్లానే కేటాయించేందుకు ప్రతిపాదన చేశారు. దీనిపై రాహుల్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎనిమిది రోజుల్లోగా దీనిపై స్పందన తెలియజేయాల్సి ఉంటుంది' అని కాంగ్రెస్ వర్గాలు వివరించాయి.

రాహుల్​కు కేటాయించిన నివాసం

ఇప్పటివరకు నాలుగుసార్లు లోక్​సభకు ఎన్నికైన రాహుల్ గాంధీ.. ఈ కాలంలో తనకు కేటాయించిన తుగ్లక్ లేన్​లోని 12వ నంబర్ బంగ్లాలోనే ఉన్నారు. పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన నేపథ్యంలో ఏప్రిల్ 22లోగా బంగ్లాను ఖాళీ చేయాలని ( Rahul Gandhi Asked to Vacate Bungalow ) గతంలో లోక్​సభ అధికారులు రాహుల్​కు నోటీసులు పంపించారు. ఈ బంగ్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని, తీపి గుర్తులను మర్చిపోలేనని అప్పట్లో రాహుల్ గుర్తు చేసుకున్నారు. అధికారుల ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 22న బంగ్లాను ఖాళీ చేశారు రాహుల్. ఆయన మాతృమూర్తి సోనియా గాంధీ ఉంటున్న దస్ జన్‌పథ్‌కు మకాం మార్చారు.

రాహుల్​కు కేటాయించిన నివాసం గేటు

వయనాడ్ టూర్
రాహుల్ గాంధీ ఆగస్టు 12-13 తేదీల్లో వయనాడ్​లో పర్యటించనున్నారు. పార్లమెంట్ సభ్యత్వాన్ని తిరిగి పొందిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గానికి వెళ్లనున్నారు. రాహుల్ పర్యటన వివరాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. 'ప్రజాస్వామ్యం గెలిచినందుకు, తమకు ప్రాతినిధ్యం వహించే గళం పార్లమెంట్​లో అడుగుపెట్టినందుకు వయనాడ్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాహుల్ ఎంపీ మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యుడు కూడా' అని కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.

మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని గుజరాత్​లోని సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేళ్లు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్​సభ సభ్యత్వం రద్దైంది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అప్పీలుకు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్​ను జులై 7న న్యాయస్థానం కొట్టేసింది. అనంతరం జులై 15న రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ పిటిషన్​ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. ఆయన్ను దోషిగా తేల్చడంపై స్టే విధించింది. ఫలితంగా లోక్​సభ సభ్యత్వం పునరుద్ధరణ అయింది.

'ప్రధాని మౌనవ్రతం ముగించేందుకే అవిశ్వాసం.. వీడియోలు రాకుంటే మోదీ నోరు విప్పేవారు కాదు'

'కూటమిలో ఎవరున్నారో తెలుసుకునేందుకే అవిశ్వాసం'.. ప్రతిపక్షాలపై మోదీ సెటైర్

Last Updated : Aug 8, 2023, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details