తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంబానీ, అదానీ.. రాహుల్​ను కొనలేరు... ఆయనొక యోధుడు: ప్రియాంక గాంధీ - ఉత్తర్​ప్రదేశ్​లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అదానీ, అంబానీ కొనుగోలు చేయలేరని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిష్ఠను దెబ్బతిసేందుకు కేంద్రం ప్రయత్నించినా ఆయన భయపడరని స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర దిల్లీ నుంచి మంగళవారం ఉత్తర్​ప్రదేశ్​లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రియాంక.

bharat jodo yatra priyanka gandhi
ప్రియాంక గాంధీ

By

Published : Jan 3, 2023, 4:36 PM IST

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన సోదరుడు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్​ను యోధుడుగా ఆమె అభివర్ణించారు. అంబానీ, అదానీ వంటి పారిశ్రామికవేత్తలు.. రాహుల్​ను కొనలేరని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రతిష్ఠను దెబ్బతిసేందుకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆయన భయపడరని ప్రియాంక స్పష్టం చేశారు. దిల్లీ నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోకి భారత్​ జోడో యాత్ర ప్రవేశించిన సందర్భంగా ఆమె రాహుల్​కు స్వాగతం పలికారు.

"అదానీ, అంబానీ వంటి పెద్ద పారిశ్రామికవేత్తలు.. చాలా మంది రాజకీయ నాయకులను, మీడియాను, ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేసి ఉండవచ్చు. కానీ వారు నా సోదరుడు రాహుల్​ గాంధీని కొనలేరు. రాహుల్ గాంధీకి శీతాకాలంలో కూడా చలి వేయట్లేదని ప్రజలు అంటున్నారు.. అందుకు కారణం ఆయన సత్యం అనే కవచాన్ని ధరించడమే. కన్యాకుమారి నుంచి 3,000 కిలోమీటర్లు యాత్ర చేసిన నా సోదరుడిని ఉత్తర్​ప్రదేశ్​లోకి స్వాగతం పలకడం గర్వంగా ఉంది."

--ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా
రా మాజీ చీఫ్ ఏఎస్ దులత్​తో రాహుల్

నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా భారత్​ జోడో యాత్రలో పాల్గొన్నారు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ ఏఎస్ దులత్ దిల్లీలో రాహుల్​ గాంధీతో కలిసి కాసేపు నడిచారు. తొమ్మిది రోజుల విరామం అనంతరం రాహుల్​ గాంధీ.. ' భారత్ జోడో యాత్ర' మంగళవారం దిల్లీలో తిరిగి ప్రారంభమై.. ఉత్తర్​ప్రదేశ్​లోకి ప్రవేశించింది. గాజియాబాద్​లోని లోనీ సరిహద్దు వద్ద రోడ్డుకు ఇరువైపులా కాంగ్రెస్​ కార్యకర్తలు, శ్రేయాభిలాషులు రాహుల్​కు స్వాగతం పలికారు. ఈ యాత్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, దిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్ చౌదరి, సీఎల్పీ నేత ఆరాధన మిశ్రా సహా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర రెండు రోజుల పాటు ఉత్తర్​ప్రదేశ్​లో జరగనుంది. అనంతరం గురువారం సాయంత్రానికి హరియాణాలోని పానీపత్​లోకి ప్రవేశించనుంది.

ABOUT THE AUTHOR

...view details