తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పోలీసులు ఎక్కడా కనిపించట్లేదు.. అందుకే జోడో యాత్ర రద్దు!' - భారత్ జోడో యాత్ర లేటెస్ట్ న్యూస్

భారత్​ జోడో యాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ శుక్రవారం నిలిపివేశారు. భద్రతను కల్పించడంలో పోలీసులు విఫలమవ్వడం వల్ల యాత్రను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే.. భారత్​ జోడో యాత్రలో ఎటువంటి భద్రతా లోపం లేదని జమ్ముకశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు.

rahul gandhi bharat jodo yatra
రాహుల్ గాంధీ

By

Published : Jan 27, 2023, 3:44 PM IST

Updated : Jan 27, 2023, 5:42 PM IST

భారత్​ జోడో యాత్రను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ శుక్రవారం తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతను కల్పించడంలో పోలీసులు విఫలమవ్వడం వల్ల యాత్రను కశ్మీర్​లోని ఖాజీగుండ్​లో యాత్రను నిలిపివేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. రద్దీని నియంత్రించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించట్లేదని అన్నారు. జోడో యాత్రకు మిగతా రోజుల్లోనైనా మెరుగైన భద్రతా కల్పిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. తన భద్రతా సిబ్బంది సూచనల మేరకు పాదయాత్రను విరమించుకున్నానని తెలిపారు రాహుల్ గాంధీ.

"జమ్ముకశ్మీర్​లో రాహుల్ గాంధీ భద్రతతో ఆడుకోవడం ద్వారా ప్రభుత్వం తన అల్ప బుద్ధిని చూపించింది. భారత్ ఇప్పటికే ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీని కోల్పోయింది. ఏ ప్రభుత్వమైనా ప్రముఖుల భద్రతపై రాజకీయాలు చేయడం మానుకోవాలి. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందిని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భద్రతా ఉల్లంఘనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. శుక్రవారం 11 కి.మీ మేర పాదయాత్ర చేయాల్సి ఉండగా.. కిలోమీటరులోపే నిలిపివేయాల్సి వచ్చింది."

--జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత

కారుపై కుర్చొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

పోలీసుల స్పందన..
రాహుల్ గాంధీ భారత్​ జోడో యాత్రలో ఎటువంటి భద్రతా లోపం లేదని జమ్ముకశ్మీర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బనిహాల్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో పాల్గొంటారని పోలీసులకు జోడో యాత్ర నిర్వాహకులు ముందుగా సమాచారం ఇవ్వలేదని అన్నారు. యాత్రను నిలిపివేయడానికి ముందు జమ్ముకశ్మీర్​ పోలీసులను యాత్ర నిర్వాహకులు సంప్రదించలేదని పేర్కొన్నారు. పోలీసులు.. జోడో యాత్రకు పటిష్ఠమైన భద్రతను కల్పిస్తున్నారని స్పష్టం చేశారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ

గతేడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. 2023 జనవరి 30 న జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో ఈ యాత్ర ముగియనుంది. 2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా భారత్​ జోడో యాత్ర చేపడుతున్నారు.

Last Updated : Jan 27, 2023, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details