కరోనా వైరస్ నియంత్రణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రణాళిక లేని లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది పేదరికంలోకి జారుకున్నారని ఆరోపించారు. ఎంతో మంది ఆరోగ్యాం ప్రమాదంలో పడిందన్నారు. డిజిటల్ విభజనతో విద్యార్థుల తమ భవిష్యత్తో రాజీ పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ నివేదక ఆధారంగా.. ట్విట్టర్లో విమర్శలు చేశారు రాహులు.