రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై జేపీసీ దర్యాప్తునకు ఎందుకు సిద్ధపడటం లేదో చెప్పాలని రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో ప్రజాభిప్రాయం కోరుతూ సర్వే నిర్వహిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం రఫేల్ డీల్‌లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిదంటూ కాంగ్రెస్ కొన్నేళ్లుగా ఆరోపిస్తూనే ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా దీనిపై ప్రచారం చేసినప్పటికీ.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. తాజాగా ఈ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో న్యాయ విచారణ జరుగుతుండటంతో భారత్‌లో కూడా సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.