కేంద్రంపై మరోసారి విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందనే సత్యాన్ని అంగీకరించాలని డిమాండ్ చేశారు. రైతులకు క్షమాపణలు చెబుతూ.. అత్యంత వివాదాస్పదమైన మూడు నూతన వ్యవసాయ చట్టాల రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మరుసటి రోజునే.. రాహుల్ ఈమేరకు ట్వీట్ చేశారు.
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నిర్వహణలో మోదీ సర్కారు విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్.. దేశ ప్రాదేశిక సమగ్రతకు రాజీపడిందని ఆరోపించింది. లద్దాఖ్ ప్రతిష్టంభన తర్వాత వాస్తవాదీన రేఖ వెంబడి పరిస్థితులపై అసలు నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.