తెలంగాణ

telangana

సూరత్​ కోర్టు తీర్పుపై హైకోర్టుకు రాహుల్.. ఊరట లభిస్తుందా?

By

Published : Apr 25, 2023, 7:50 PM IST

Updated : Apr 25, 2023, 10:11 PM IST

పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ రాహుల్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని.. గుజరాత్‌ జిల్లా కోర్టు తోసిపుచ్చగా ఆయన హైకోర్టుకు వెళ్లారు.

Rahul Gandhi To Gujarat High Court Against Surat Court Decision
సూరత్​ కోర్టు తీర్పును సవాల్​ చేస్తూ గుజరాత్‌ హైకోర్టుకు రాహుల్ గాంధీ

నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ రాహుల్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని.. గుజరాత్‌ జిల్లా కోర్టు తోసిపుచ్చగా ఆయన హైకోర్టుకు వెళ్లారు. మోదీ ఇంటిపేరు ఉన్న నేతలపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన భాజపా నేత పూర్ణేశ్ మోదీ సూరత్‌ కోర్టులో పిల్​ వేశారు. దీంతో మోదీ ఇంటిపేరును కించపరిచేలా మాట్లాడిన రాహుల్​ గాంధీ వ్యాఖ్యలపై 2019లో క్రిమినల్​ కేసు నమోదైంది.

ఈ కేసుపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. 2023, మార్చి 23న ఇచ్చిన తీర్పులో రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే దీన్ని పై కోర్టులో సవాల్‌ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ మార్చి 24న లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా ఈ కేసుపై గుజరాత్​ హైకోర్టులో రాహుల్​ వేసిన పిటిషన్​కి సంబంధించిన విచారణ ఈ వారంలోనే జరిగే అవకాశం ఉంది. కాగా, ఈ కేసులో తనపై విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను సూరత్​ సెషన్స్​ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది.

ఇదీ కేసు..
2019లో కర్ణాటకలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో రాహుల్​ గాంధీ మాట్లాడిన మాటలతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. మోదీ ఇంటిపేరుపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌లోని సూరత్‌లో పరువునష్టం దావా దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. దీనిపై ఇటీవల విచారణ జరిపిన సూరత్‌ కోర్టు.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అంతే కాకుండా ఈ వేటు కారణంగా ప్రజాప్రతినిధులకు కేటాయించే అధికారిక భవనాన్ని కూడా రాహుల్​ ఇటీవలే ఖాలీ చేశారు. కాగా, రాహుల్​ గాంధీ కేరళలోని వయనాడ్‌ పార్లమెంట్​ స్థానం నుంచి గెలుపొందారు.

Last Updated : Apr 25, 2023, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details