రక్షణ రంగ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంట్ కమిటీ సమావేశం నుంచి రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్కు చెందిన సభ్యులు వాకౌట్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రత, రక్షణ బలగాలకు మెరుగైన ఆయుధ పరికరాల సమకూర్చడం వంటి కీలకమైన అంశాలపై చర్చించకుండా... జవాన్ల యూనిఫాంపై చర్చలు జరుపుతూ.. కమిటీ సమయాన్ని వృధా చేస్తోందని రాహుల్ ఆరోపించినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి.
పార్లమెంట్ కమిటీ భేటీ నుంచి రాహుల్ వాకౌట్ - Rahul Gandhi news
రక్షణ రంగానికి సంబంధించిన పార్లమెంట్ కమిటీ సమావేశం నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. పనికిరాని చర్చలతో కమిటీ సమయం వృధా చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించినట్లు అధికారులు తెలిపారు.
![పార్లమెంట్ కమిటీ భేటీ నుంచి రాహుల్ వాకౌట్ Rahul Gandhi alleges Parliament panel's time wasted in discussing armed forces uniform](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9900148-thumbnail-3x2-rahul.jpg)
పార్లమెంట్ కమిటీ సమావేశం నుంచి కాంగ్రెస్ వాకౌట్
"త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సమక్షంలో సైనికుల యూనిఫాంపై చర్చించగా.. రాహుల్ జోక్యం చేసుకుని రక్షణ రంగాల బలోపేతం, జాతీయ భద్రత చర్చించాలని కోరారు. చైనా దురాక్రమణ, రక్షణ దళాలకు మెరుగైన ఆయుధాలు వంటి అంశాలనూ ప్రస్తావించారు. ప్యానెల్ ఛైర్మన్ జుయల్ ఓరం అనుమతించని నేపథ్యంలో రాహుల్ సహా ఇతర కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు" అని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:స్పెక్ట్రం వేలానికి కేబినెట్ ఆమోదం
Last Updated : Dec 16, 2020, 5:52 PM IST