తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఆగ్రహం​.. దేశవ్యాప్తంగా నిరసనలు - ఇంధన ధరల పెరుగుదలపై నిరసనలు

Rahul Gandhi Protest On Fuel Price Hike: ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి దిల్లీలోని విజయ్ చౌక్​లో ఆందోళన నిర్వహించారు. పార్లమెంట్ ఉభయ సభలలో కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

rahul gandhi
రాహుల్ గాంధీ

By

Published : Mar 31, 2022, 12:32 PM IST

Updated : Mar 31, 2022, 1:01 PM IST

Rahul Gandhi Protest On Fuel Price Hike: ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ మండిపడింది. పదిరోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్​ డీజిల్​ రేట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పెంచిన ధరలను పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపు.. సామాన్యుడికి భారంగా మారిందని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి దిల్లీలోని విజయ్ చౌక్​లో ధర్నా నిర్వహించారు రాహుల్​. పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిరసనల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ

"పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయి. ఇంధన ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో పేదవారి నుంచి ప్రభుత్వం డబ్బులు దోచుకుని పారిశ్రామికవేత్తలకు ఇస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడదే జరుగుతోంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

ఇంధన ధరల పెరుగుదలకు నిరసిస్తూ.. చెన్నైలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరలను తగ్గించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ నేతృత్వంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.

ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నిరసనలు
ఇంధన ధరల పెరుగుదలపై చెన్నై నిరసనలు

ఇదీ చదవండి:ఓటమి నేర్పిన పాఠం.. కాంగ్రెస్​లో చలనం

Last Updated : Mar 31, 2022, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details