ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశం.. చరిత్రలో తొలిసారి ఆర్థిక మాంద్యంలోకి జారుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దాదాపు 3కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ ఉపాధి హామీ పథకం కింద పనిచేసేందుకు ఎదురుచూస్తున్నారని తెలిపారు. రెండో త్రైమాసికం ఫలితాల్లోనూ ఆర్థిక వృద్ధి క్షీణించడంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మోదీ హయాంలో ఆర్థిక మాంద్యంలోకి భారత్: రాహుల్
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోదీ హయాంలో దేశం ఆర్థిక మాంద్యంలోకి జారుకుందని ఆరోపించారు. రెండో త్రైమాసికంలోనూ ఆర్థిక వృద్ధి క్షీణించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
'మోదీ హయాంలో ఆర్థిక మాంద్యంలోకి భారత్'
కఠినమైన షరతుల వల్ల ఆర్థిక వృద్ధి సాధ్యపడదన్నారు. ఈ విషయాన్ని మోదీ మొదట గ్రహించాలని ఎద్దేవా చేశారు. ఆర్థిక వృద్ధి మైనస్ 7.5 శాతంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తొలి త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే కరోనా సంక్షోభంలోనూ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవటం ఆశాజనక పరిణామమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ట్విటర్లో విమర్శలు చేశారు రాహుల్ గాంధీ.