తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదానీ' కుమ్మక్కై దేశాన్ని దోచేస్తున్నారు: రాహుల్​ గాంధీ - Rahul Gandhi Modani Video

ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, గౌతమ్ అదానీ కుమ్మక్కై దేశాన్ని దోచేస్తున్నారని రాహుల్ అన్నారు.

rahul comments on modi adani foreign policy
మోదీ అదానీలపై రాహుల్​ తాజా వీడియో

By

Published : Mar 14, 2023, 5:16 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్​ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కుమ్మక్కై దేశాన్ని దోచేస్తున్నారని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ విమర్శించారు. మోదీ, అదానీ కలిసి అనేక వ్యాపార లావాదేవీలను జరిపి వ్యక్తిగత సంపదను పెంచుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను రాహుల్​ ట్విట్టర్​ వేదికగా షేర్​ చేశారు. మోదీ, గౌతమ్​ అదానీ ఇద్దరూ ప్రభుత్వ వ్యవస్థలోని నిబంధనలను వారికి అనుకూలంగా మార్చుకొని విదేశీ, రక్షణ వ్యాపార రంగాల్లో ఒకరికొకరు ఏ విధంగా సహకారం ఇచ్చుపుచ్చుకున్నారో అనే అంశాలపై ఆరోపణలు చేశారు రాహుల్​. ప్రధాని మోదీ, అదానీల భాగస్వామ్యాన్ని 'మోదానీ'గా అభివర్ణించారు రాహుల్. వారిద్దరూ కలిసి విదేశాంగ విధానాన్ని విదేశీ 'డీల్​'గా మార్చారంటూ ఆరోపించారు.

ప్రపంచ వ్యాప్తంగా అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకే మోదీ విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టారని రాహుల్ ఎద్దేవా చేశారు. దీంతో దేశాన్ని అంధకారంలోకి నెట్టారని రాహుల్​ మండిపడ్డారు. అంతేగాక అదానీ మేలు కోసం ఇప్పటివరకు మోదీ ఎన్ని దేశాలకు వెళ్లారో.. అలాగే వెళ్లిన దేశాల ప్రతినిధులతో అదానీ ఎన్ని ఒప్పందాలు చేసుకుని సంతకాలు చేశారో బయట పెట్టాలని రాహుల్​ ప్రశ్నించారు.

అదానీ కోసమే మోదీ విదేశీ పర్యటనలు..: రాహుల్​
ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రతినిధి బృందం 2013లో గుజరాత్‌లో అదానీ సమక్షంలో మోదీని కలిసిందని రాహుల్ మీడియా కథనాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత 2014 మేలో ఆస్ట్రేలియాలో 15.5 మిలియన్ డాలర్ల బొగ్గు, రైల్వైే ప్రాజెక్టులను అదానీ కొనుగోలు చేశారని రాహుల్​ గుర్తు చేశారు. అలాగే 2014 నవంబర్​లో ఆస్ట్రేలియాలో జరిగిన జీ20 సదస్సుకు మోదీ హాజరైనప్పుడు కూడా అదానీ ఆస్ట్రేలియాకు వెళ్లారని అన్నారు. ఈ పర్యటనలో భాగంగానే అదానీకి అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరుంధతీ భట్టాచార్య ఆస్ట్రేలియాలో బొగ్గు ప్రాజెక్టు స్థాపనకు కావాల్సిన నిధులను సమకూర్చేందుకు అదానీ గ్రూప్‌నకు ఎస్​బీఐ నుంచి ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తూ ఒప్పందంపై ఆమె సంతకాలు చేశారని రాహుల్​ గుర్తు చేశారు.

"2015 జూన్​లో మోదీ తన మొదటి అధికారిక పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్​ 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను అభివృద్ధి చేసేందుకు బంగ్లాదేశ్​తో అదానీ పవర్ ఎంఓయూపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో ఆ దేశ మార్కెట్ ధర కంటే అదానీ విద్యుత్ ధరను ఐదు రెట్లు ఎక్కువగా చూపించారు. ఇక 2022 మార్చిలో అదానీ గ్రూప్ 500 మిలియన్ డాలర్ల విలువైన రెండు పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలను కైవసం చేసుకుంది. అంతేగాక 2016 మార్చిలో విమానాలకు సంబంధించి ఇజ్రాయెల్​కు చెందిన ఓ సంస్థతో అదానీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రధాని మోదీ 2017లో చేసిన ఇజ్రాయిెల్​ పర్యటనలో కూడా అదానీకి లాభం చేకూరే పనే చేశారు. దీంట్లో అదానీ గ్రూప్..​ ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్‌ అనే సంస్థలో 26 శాతం వాటాలను కొనుగోలు చేసింది.

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ABOUT THE AUTHOR

...view details