తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారిని బ్రిటన్​కు పంపాం.. మోదీని నాగ్​పుర్ పంపిస్తాం'

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బలమైన శత్రువుగా అభివర్ణించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. 70 ఏళ్ల క్రితం బ్రిటిష్​ పాలకులను దేశ ప్రజలు వెనక్కు పంపించినట్లుగానే.. తాము మోదీని పంపిస్తామని వ్యాఖ్యానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. ప్రజల కోసం కాకుండా మోదీ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.

Rahul calls PM a 'formidable enemy,
'మోదీ అనే బలమైన శత్రువుతో మనం పోరాడుతున్నాం'

By

Published : Mar 1, 2021, 5:35 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ అగ్ర నేత రాహుల్​ గాంధీ మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. మోదీ తన ప్రత్యర్థులను అణచి వేసే ఓ బలమైన శత్రువు అని ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటీషు వారిని వెనక్కి పంపించినట్లే ఈ దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని కూడా పదవి నుంచి దించుతారని తెలిపారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో రాహుల్​ పాల్గొన్నారు.

మనం ఓ బలమైన శత్రువుతో పోరాడుతున్నాం. దేశంలోని డబ్బుపై ఆధిపత్యం చెలాయిస్తున్న శత్రువుతో మనం పోరాడుతున్నాం. తన ప్రత్యర్ధులను అణచివేస్తున్న శత్రువుతో మనం పోరాటం చేస్తున్నాం. కానీ ఈ కొత్త శత్రువు కంటే కూడా చాలా పెద్ద శత్రువును మనం ఓడించాం. మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 70ఏళ్ల క్రితం ఈ దేశాన్ని బ్రిటీష్‌ వారు పాలించారు. నరేంద్ర మోదీ కంటే బ్రిటీష్‌ వారు చాలా బలమైనవారు. భారతదేశ ప్రజలు బ్రిటీష్‌ పాలకులను వెనక్కి పంపించారు. అదే తరహాలో మనం నరేంద్ర మోదీని నాగ్‌పుర్‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రధాన కార్యాలయం‌)కు పంపిస్తాం.

-రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అగ్ర‌నేత

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. మోదీకి లొంగిపోయారని రాహుల్​ గాంధీ విమర్శించారు. ప్రజల కోసం కాకుండా మోదీ కోసం పళనిస్వామి పని చేస్తున్నారని ఆరోపించారు.

"తమిళనాడు ముఖ్యమంత్రికి ఒకవేళ అవినీతి చరిత్ర ఉన్నట్లయినా నేను పట్టించుకోను. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆయన ఎందుకు నిల్చోలేకపోతున్నారనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను."

-రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అగ్ర‌నేత

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థుల చర్చల నుంచి వచ్చిన విధానాలనే విద్యావ్యవస్థలో పొందుపరుస్తామనిరాహుల్​ గాంధీ అన్నారు. జాతీయ సైన్స్​ దినోత్సవం సందర్భంగా తమిళనాడు, తిరునల్వేలిలోని సెయింట్ ​జేవియర్​ కళాశాల ప్రొఫెసర్లతో రాహుల్ సంభాషించారు.

ఇదీ చూడండి:'వారికి ప్రజా సంక్షేమం కంటే.. వారసత్వమే ముఖ్యం'

ABOUT THE AUTHOR

...view details