కొవిడ్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు మాత్రమే కనిపించే అద్దాలు ధరించారని, అవి తీసేసి దేశంలో పరిస్థితిని చూడాలని ఎద్దేవా చేశారు.
"లెక్కలేనన్ని మృతదేహాలు నదుల్లో తేలుతున్నాయి. వేల మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ సతమతమవుతున్నారు. మోదీ జీ... నూతన పార్లమెంట్ తప్ప ఇంకేమీ చూడలేకపోతున్న ఆ అద్దాలను కాస్త తొలగించండి."