తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంగీతానికి కేరాఫ్​ ఆ 'గిటార్​ హౌస్​' - సంగీతానికి కేరాఫ్​ అడ్రాస్​ ఆ 'గిటార్​ హౌస్​'

అతనికి సంగీతం అంటే ప్రాణం. సంగీతం పట్ల ఉన్న అభిమానంతో అతని ఇల్లునే మిని సంగీత ప్రపంచంగా మార్చేశాడు. అందులో లేని సంగీత వాద్యం ఉండదు. వాటిల్లో గిటార్​ వాయించడం అంటే అతనికి మహా ఇష్టం. అందుకే ఇంటిని ఏకంగా 'గిటార్​ హౌస్'​గా మార్చేశాడు. ఆ ఇంటిని చూస్తే వావ్​ అనకుండా ఉండలేరు. ఇంతకు అతనెవరు? మీ మనసు దోచే ఆ ఇల్లు ఎక్కడుందో చూద్దామా..?

rahul arora of haridwar made his house a guitar house
సంగీతానికి కేరాఫ్​ అడ్రాస్​ ఆ 'గిటార్​ హౌస్​'

By

Published : Feb 20, 2021, 8:00 PM IST

Updated : Feb 20, 2021, 8:09 PM IST

సంగీతానికి కేరాఫ్​ 'గిటార్​ హౌస్​'

కాలంతో పాటు ప్రజల్లో సంగీతం పట్ల అభిరుచి పెరుగుతూ వస్తోంది. దీనికి చక్కని ఉదాహరణగా.. సంగీతం పట్ల అమితమైన అభిమానాన్ని మాటల్లో చెప్పలేని ఓ సంగీత ప్రియుడు.. ఇల్లునే గిటారు రూపంలో నిర్మించి చూపించాడు. ఆ ఇంటిని చూస్తే.. అబ్బా ఏముందిరా అనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. సంగీతానికి నిలువెత్తు రూపం ఆ ఇల్లు.

ఆ గిటారిల్లు- ఓ సంగీత ప్రపంచం..

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని ధర్మనగరికి చెందిన రాహుల్​ అరోరాకు సంగీతం అంటే ప్రాణం. గిటారు వాయించడం అంటే మహా ఇష్టం. అందుకే అతని ఇంటిని ఏకంగా గిటార్​ హౌస్​గా మార్చేశాడు. ఆ ఇంటిని మినీ సంగీత ప్రపంచం అని పిలవడంలో అతిశయోక్తి లేదు. ఇంటి వెలుపల భాగాన్ని గిటారు ఆకృతిలో నిర్మించగా.. పియానో, డ్రమ్స్​, వయొలిన్​ వంటి సంగీత వాయద్యాలతో ఉన్న లోపల గదులు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో ఎంతో ఆకర్షణగా కనిపిస్తుంది ఆ ఇల్లు.

రాహుల్​ అరోరా మంచి సంగీతకారుడని, డబ్బు తీసుకోకుండా పేద పిల్లలకు సంగీతం నేర్పుతాడని స్థానిక ప్రజలు అంటున్నారు. సంగీతంలో ప్రతిభావంతులు కావాలనుకునే పిల్లలకు.. రాహుల్​ ఒక ప్రేరణ అని చెబుతున్నారు.

ఇదీ చూడండి:ఆ కార్డులతో యాచకులు, దివ్యాంగులకు ఉచిత భోజనం

Last Updated : Feb 20, 2021, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details