తమిళనాట కొత్తగా ఏర్పాటైన స్టాలిన్ ప్రభుత్వంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర ఆర్థిక మండలిలో ఆయనతో పాటు అమెరికా.. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ డుఫ్లోకు స్థానం కల్పించింది స్టాలిన్ సర్కార్. ముఖ్యమంత్రి ఆర్థిక సలహా మండలిలో భాగంగా ఉంటారని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ సోమవారం వెల్లడించారు.
రాష్ట్ర శాసనసభను ఉద్దేశించి గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ మట్లాడారు. ఈ క్రమంలో రాష్ట్రం ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఓ కమిటిని నియమించినట్లు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఎస్తేర్ డుఫ్లో, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్, అభివృద్ధి ఆర్థికవేత్త జీన్ డ్రేజ్, మాజీ కేంద్ర ఆర్థిక కార్యదర్శి డాక్టర్ ఎస్ నారాయణ్‌లు ఈ కమిటీలో ఉండనున్నట్లు తెలిపారు.