Rafale Navy India : ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. రక్షణ కొనుగోళ్ల మండలి చేసిన ప్రతిపాదనలను రక్షణ శాఖ గురువారం ఆమోదించింది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఒకే సీటు కలిగిన 22 రఫేల్ మెరైన్ విమానాలు భారత నౌకాదళానికి అందుతాయి. దీంతో పాటు నాలుగు శిక్షణా విమానాలు సైతం భారత్‌కు అందుతాయి.
సుమారు రూ.90వేల కోట్లు..
Indian Navy Rafale Deal : 26 రఫేల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలుకు సుమారు రూ.90 వేల కోట్లు అవుతున్నట్లు అంచనా. అయితే కచ్చితమైన విలువ మాత్రం ఒప్పందం ఖరారైన తర్వాతే తెలిసే అవకాశం ఉంది. వీటితోపాటు ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ కంపెనీ.. భారత్‌కు చెందిన ఒక సంస్థతో కలిసి సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను అభివృద్ధి చేసే అంశంపైనా ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కమిటీ ఏర్పాటు చేసి..
Rafale France India : అయితే భారత్.. ఈ ఒప్పందంలో ధరల రాయితీలను కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఒప్పందం కోసం భారత్, ఫ్రాన్స్.. సంయుక్త చర్చల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. డీల్‌పై ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాకే.. తుది నిర్ణయం అమలులోకి వస్తుందని చెప్పాయి.
గతేడాది డిసెంబరులో చివరగా..
Rafale Indian Navy : వాయుసేన కోసం భారత్ ఇప్పటి వరకు.. 36 రఫేల్ జెట్‌లను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. ఆ దేశ సహకారంతో భారత్‌లో ఇప్పటికే ఆరు స్కార్పీన్ జలాంతర్గాములను నిర్మించింది. యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ రఫేల్ జెట్ గతేడాది డిసెంబర్లో మన దేశానికి చేరుకుంది.
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా
Modi France Visit 2023 : అయితే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శుక్రవారం ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో గౌరవ అతిథిగా ఆయన పాల్గొననున్నారు. ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలు, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం, ఇండో-పసిఫిక్ ప్రాంత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది.