తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజ్యసభ టికెట్​కు కాంగ్రెస్​లో తీవ్ర పోటీ- లాబీయింగ్​ షురూ! - కాంగ్రెస్​ పార్టీ

రాజ్యసభ ఉప ఎన్నికల(rajya sabha election 2021) నిర్వహణపై ఎన్నికల సంఘం ప్రకటన చేసిన క్రమంలో.. కాంగ్రెస్​లో వాతావరణం వేడెక్కింది. టికెట్​ కోసం సీనియర్లు సహా ప్రముఖ నేతల మధ్య పోటీ పడుతున్నారు. ​రెండు చోట్ల హస్తం పార్టీ పోటీ చేయనున్న నేపథ్యంలో ఆశావాహులు అధిష్ఠానాన్ని కాకా పట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరి ఎవరికి టికెట్​ దక్కుతుందో?

Congress for two Rajya Sabha seats
రాజ్యసభ టికెట్​ కోసం కాంగ్రెస్​ నేతల లాబీయింగ్​

By

Published : Sep 10, 2021, 5:26 PM IST

దేశంలో ఖాళీగా ఉన్న 7 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు(rajya sabha election 2021) నిర్వహించేందుకు షెడ్యూల్​ ప్రకటించింది ఎన్నికల సంఘం. పుదుచ్చేరి, బంగాల్​, అసోం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లో ఒక్కో స్థానం, తమిళనాడులో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి అక్టోబర్​ 4న ఎన్నికలు(rajya sabha bypoll) నిర్వహించాలని నిర్ణయించింది ఈసీ. ఈ క్రమంలో కాంగ్రెస్​ పార్టీలో అంతర్గతంగా వాతావరణం వెడెక్కింది. టికెట్​ కోసం అధిష్ఠానాన్ని కాకా పట్టేందుకు నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

రెండు స్థానాల్లో..

హస్తం పార్టీ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ పడే అవకాశం ఉంది. అందులో ఒకటి తమిళనాడు, మరొకటి మహారాష్ట్ర. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కుదిరిన ఒప్పందం ప్రకారం తమిళనాడులో ఒక రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్​కు ఇస్తానని డీఎంకే హామీ ఇచ్చింది. మరోవైపు.. మహారాష్ట్రలో కాంగ్రెస్​ నేత రాజీవ్​ సాతవ్​ మృతితో ఆయన స్థానం ఖాళీ ఏర్పడింది.

ఆశావాహుల్లో కీలక నేతలు..

రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​​, ముకుల్​ వాస్నిక్​, మిలింద్​ డియోరా, సంజయ్​ నిరుపమ్​, ప్రమోద్​ తివారీ సహా పలువురు నేతలు టికెట్​ ఆశిస్తున్నట్లు సమాచారం.

అయితే తమిళనాడులో.. పార్టీ డేటా విశ్లేషణ విభాగం ఛైర్మన్​ ప్రవీణ్​ చక్రవర్తి పట్ల కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ, రాజకీయేతర వ్యక్తిని ఎగువ సభకు పంపేందుకు డీఎంకే నాయకత్వం సుముఖంగా లేనట్లు సమాచరాం. మరోవైపు.. గులాం నబీ ఆజాద్​ డీఎంకే నేతలతో మంచి సంబంధాలు నెరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ సన్నిహితుల్లో ఒకరైన.. ప్రమోద్​ తివారీ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

మహారాష్ట్రలో.. ఖాళీగా ఉన్న ఒకే ఒక స్థానానికి ముగ్గురు నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గానికి చెందిన నేత ముకుల్​ వాస్నిక్​, మిలింద్​ డియోరా, కాంగ్రెస్​ పార్టీ ముంబయి విభాగం మాజీ అధ్యక్షుడు సంజన్​ నిరుపమ్​లు టికెట్​ కోసం చూస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల వేళ గత వారమే రాహుల్​ గాంధీని నిరుపమ్​ కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

గులాం నబీ ఆజాద్​, వాస్నిక్​, వీరప్ప మొయిలీ సహా ఆశావాహుల్లోని పలువురు నేతలు జీ-23కి చెందిన వారు. మొయిలీ, వాస్నిక్​లు రాహుల్​ గాంధీతో సంబంధాలు మెరుగుపరుచుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

భాజపా..

భాజపా సైతం రెండు స్థానాల్లో పోటీ పడే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్​లో ఒకటి, అసోంలో ఒక స్థానంలో తమ అభ్యర్థులను బరిలోకి దింపనుంది. అసోం నుంచి సర్బానంద్​ సోనోవాల్​ను రాజ్యసభకు పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పుదుచ్చెరీలోని స్థానం.. ఎన్​డీఏ భాగస్వామ్య పార్టీకి వెళ్లనుంది. బంగాల్​లో కాంగ్రెస్​ నుంచి టీఎంసీలో చేరిన సుశ్మిత దేవ్​ బరిలో దిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:'వచ్చే ఎన్నికల్లో చిన్న పార్టీలతోనే కాంగ్రెస్ జట్టు'

ABOUT THE AUTHOR

...view details