విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) అధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మ శ్రీ అవార్డు గ్రహీత రవీంద్ర నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. బిహార్‌కు చెందిన సింగ్.. వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. వైద్య రంగంలో చేసిన విశేష సేవలకు గానూ 2010లో ఆయనను పద్మ శ్రీతో సత్కరించింది కేంద్రం.
ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న విష్ణు సదాశివ కోక్జీ స్థానాన్ని భర్తీ చేయనున్నారు నారాయణ్ సింగ్. సదాశివ.. 2018 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.
"అధ్యక్షుడిగా పద్మ శ్రీ రవీంద్ర నారాయణ్ సింగ్‌ను ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోక్జీ జీ 82 ఏళ్లకు చేరుకున్నారు. వీహెచ్‌పీ అధ్యక్షుడిగా తన సేవల నుంచి తప్పుకోవాలని కోరుకున్నారు. ఆయన కోరికతో పాటు మన రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాం. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపటం అనేది మనకు దక్కిన గౌరవం. "